పాల పొడితో ఇలా చేస్తే..మృదువైన, మెరిసే చ‌ర్మం మీసొంతం!

మృదువైన, మెరిసే చ‌ర్మం కోసం అంద‌రూ త‌హ త‌హ‌లాడుతుంటారు.అందుకోసం మార్కెట్‌లో దొరికే ఖ‌రీదైన క్రీములు, లోష‌న్లు, మాయిశ్చ‌రైజ‌ర్లు కొనుగోలు చేసి వాడుతుంటారు.

 Good Beauty Benefits Of Milk Powder-TeluguStop.com

అయితే ఇంట్లో కొన్ని కొన్ని టిప్స్ పాటించ‌డం ద్వారా కూడా మృదువైన మెరిసే చ‌ర్మాన్ని పొందొచ్చు.ముఖ్యంగా పాల పొడి ఇందుకు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి పాల పొడిని ఎలా యూజ్ చేయాలి అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

 Good Beauty Benefits Of Milk Powder-పాల పొడితో ఇలా చేస్తే..మృదువైన, మెరిసే చ‌ర్మం మీసొంతం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో పాల పొడి, చంద‌నం పొడి మ‌రియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేయాలి.పావు గంట పాటు ఆర‌నిచ్చి అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తూ ఉంటే.ముడ‌త‌లు పోయి ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

Telugu Beauty, Beauty Tips, Benefits Of Milk Powder, Face Packs, Latest News, Milk Powder, Milk Powder For Skin, Skin Care-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

అలాగే ఒక్ బౌల్‌లో పాల పొడి, బాదం పొడి మ‌రియు గోరు వెచ్చ‌ని నీరు పోసి క‌లుపు కోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్రంతో ఫేస్ ప్యాక్ వేసుకుని ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం కొద్దిగా నీళ్లు జ‌ల్లి వేళ్ల‌తో రుద్దుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో మూడు లేదా నాలుగు సార్లు చేస్తూ న‌ల్ల మ‌చ్చ‌లు పోవ‌డంతో పాటు చ‌ర్మ ఛాయ పెరుగుతుంది.

ఇక పాల పొడి, చిటికెడు ప‌సుపు, రోజ్ వాట‌ర్ ఈ మూడిటినీ ఒక బౌల్‌లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి ప‌దిహేను నిమిషాలు పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే మొటిమ‌లు పోయి చ‌ర్మం ప్ర‌కాశ‌వంతంగా మెరుస్తుంది.

#Beauty Tips #Milk Powder #Skin Care #BenefitsOf #MilkPowder

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు