వ్యక్తి హత్య కేసులో కోడిపుంజు హస్తం.. అరెస్ట్ చేసిన పోలీసులు.. !!

అదేంటి రుచిగా వండుకునే కోడిపుంజు హస్తం ఒక వ్యక్తి హత్యలో ఉండటం ఏంటని ఆలోచిస్తున్నారా.అందులో అది మనిషిని చంపడమేంటని ఆశ్చర్యపోతున్నారా.

 Gollapalli Police Arrested Hen In A Murder Case-TeluguStop.com

అయితే ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.ఆ వివరాలు చూస్తే.

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని లొత్తునూర్ గ్రామంలో కోడి పందాలు నిర్వహించేందుకు పందెం రాయుళ్లు ఏర్పాట్లు చేసుకుంటున్న నేపధ్యంలో వెల్గటూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సత్తయ్య(45) అనే వ్యక్తికి కోడి పుంజుకు అమర్చిన కత్తి గుచ్చుకోవడంతో తీవ్రగాయాలు అయ్యాయట.కాగా అతన్ని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించాడట.

 Gollapalli Police Arrested Hen In A Murder Case-వ్యక్తి హత్య కేసులో కోడిపుంజు హస్తం.. అరెస్ట్ చేసిన పోలీసులు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కోడిపుంజుకు కట్టిన కత్తి కారణంగా ఈ వ్యక్తి మరణించాడని తెలిసిందట.కాగా ఒక వ్యక్తి మరణానికి కారణమైన కోడిపుంజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం.

అయితే ఈ విషయంలో స్పందించిన గొల్లపల్లి ఎస్సై బి.జీవన్, కోడిని కోళ్ల ఫారంలో సంరక్షణ నిమిత్తం అప్పగించామని, అరెస్ట్ చేయలేదని వివరించారట.ఇక మనిషిని మనిషి చంపుకుంటేనే దిక్కులేదు.కోడి విషయంలో మాత్రం ఏం జరుగుతుందని ఈ విషయం తెలిసిన నెటిజన్స్ అనుకుంటున్నారట.

#Murder Case #Jagityal #Cock Fight #Cock #Killing

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు