ఇండియన్‌ 2 కోసం గోల్డెన్‌ సెట్‌.. ఇండియన్‌ సినీ ఇండస్ట్రీలో మొదటిసారి

శంకర్‌ ఏం చేసినా కూడా రిచ్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు.ప్రతి విషయంలో కూడా భారీతనం కనిపించేలా ప్రయత్నాలు చేసే శంకర్‌ తాజాగా తన ‘ఇండియన్‌ 2’ చిత్రం కోసం రికార్డు స్థాయిలో ఖర్చు చేయిస్తున్నాడు.2.ఓ చిత్రంకు 550 కోట్లు ఖర్చు చేసిన శంకర్‌ ఇండియన్‌ 2 కోసం దాదాపు 200 కోట్లను ఖర్చు చేయబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది.గ్రాఫిక్స్‌ లేవు, పౌరాణిక చిత్రం అంతకన్నా కాదు, అయినా కూడా శంకర్‌ ఆస్థాయిలో ఖర్చు పెట్టించడం చర్చనీయాంశం అవుతోంది.మరో వైపు ఈ చిత్రంకు సంబంధించిన భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 Golden Set For Shankars Indian 2 Movie-TeluguStop.com

ఈ చిత్రంలోని రెండు నిమిషాల చిత్రీకరణ కోసం గోల్డ్‌ సెట్‌ను నిర్మిస్తున్నారట.గోల్డ్‌ సెట్‌ అంటే పూర్తిగా గోల్డ్‌తో వేస్తున్నది కాదు, కాని నిజంగా గోల్డ్‌లా అనిపించే మెటీరియల్‌తో వేస్తున్నారు.దాదాపు రెండు కోట్లు పెట్టి ఆ సెట్టింగ్‌ను నిర్మిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.భారీ ఖర్చుతో రూపొందుతున్న ఆ సెట్‌ కోసం చైనా నుండి మెటీరియల్‌ను ఇంపోర్ట్‌ చేస్తున్నారట.

కేవలం రెండు నిమిషాలే అయినా కూడా ఆ సీన్‌ సినిమాలో చాలా కీలకం.అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

రెండు నిమిషాల సీన్‌కే రెండు కోట్లు ఖర్చు చేస్తున్న శంకర్‌ ఇక సినిమా మొత్తంను ఏ స్థాయిలో రూపొందిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అద్బుతమైన విజువల్స్‌ కోసం హెలికాప్టర్‌లో లొకేషన్స్‌ వేట కొనసాగించాడు.ఇంకా చెప్పాలంటే దేశ వ్యాప్తంగా జల్లెడ పట్టి మరీ లొకేషన్స్‌ను ఎంపిక చేసుకున్నాడు.ప్రతి చిన్న విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.కమల్‌ హీరోగా నటించబోతున్న ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.ఈనెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌కు ఏర్పాట్లు ప్రారంభం అవుతున్నాయి.

వచ్చే ఏడాది చివరి వరకు సినిమా విడుదల అయ్యే అవకాశాలున్నాయి.కమల్‌కు ఇదే చివరి సినిమా అనే విషయం తెల్సిందే.

అందుకే శంకర్‌ ప్రత్యేక శ్రద్ద పెడుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube