ఒక చిన్న క్లిప్ ను చూసి బయపడిపోయిన కుక్క,ఫిదా అవుతున్న నెటిజన్లు

కుక్కలు దేన్నీ చూసినా సాధారణంగా భయపడవు.అయితే కుక్కల్లో గోల్డెన్ రిట్రీవర్ అనే జాతికి చెందిన కుక్క అయితే మరీ ను ఎలాంటి దానికి అయినా పెద్దగా భయపడదు, చలించదు కూడా.

 Golden Retrieverreactionto Aplasticclip-TeluguStop.com

చాలా గంభీరంగా కనిపించే ఆ కుక్క ఒక ప్లాస్టిక్ క్లిప్ విషయం అది చూపిన భయాన్ని చూసిన నెటిజన్లు తెగ ఫిదా అయిపోతున్నారు.ఆ క్లిప్‌ని చూపిస్తే చాలు… “వామ్మో… నా కొద్దు ఇది అన్నట్లు ఫేస్ పెట్టి.

ఆందోళనగా చూడడం చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.ఈ క్రమంలో అది పెట్టె ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ కి నెటిజన్లు మరి ఫిదా అయిపోతున్నారు.

అందుకే ఎవరిష్టం వచ్చినట్లు వారు ఆ ఎక్స్ ప్రెషన్స్ కు మాటలు కూడా అల్లేసుకుంటున్నారు.అసలది ఏంటిది? దాన్ని నాకెందుకు చూపిస్తున్నారు? అది ఎందుకు తెరచుకొని, మూసుకుంటోంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఆ కుక్క మైండ్‌లో మెదులుతున్నట్లు నెటిజన్లు వూహించుకుంటున్నారు.కర్ట్‌నీ బడ్జిన్ ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఒక చిన్న క్లిప్ ను చూసి బయపడిప

ఏడాది వయసున్న ఆ పప్పీ బెడ్‌పై అటూ ఇటూ గెంతుతూ క్లిప్‌ని తనకు చూపించవద్దన్న రేంజ్ లో ఓనర్ ని బతిమాలుతున్నట్లు దాని కదలికలు ఉన్నాయంటూ నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారట.ఎలాగైనా ఆ క్లిప్‌ని కొరకాలని అనుకుంటూ, లోలోపల భయపడుతూ ఆ కుక్క ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.దీనితో ఈ వీడియో కి అప్పుడే 2 లక్షల మంది దాకా వీక్షించారు అంటే అర్ధం చేసుకోవచ్చు ఆ వీడియో ఎంతగా వైరల్ అయ్యింది అనేది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube