కళ్లు లేని కుక్కకు మరో కుక్క సాయం.. వీడియో వైరల్!

ఈ మధ్య కాలంలో మనుషులు మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు.తోటి మనుషులకు సాయం చేయడానికి వెనుకాడుతున్నారు.

 Golden Retriever Loses Eyesight Provided With A Puppy Friend To Help Him Navigat-TeluguStop.com

అవతలి వాళ్లకు సాయం చేసే సత్తా ఉన్నా సాయం చేయడానికి ఆసక్తి చూపడం లేదు.అయితే మనుషులు మాన్వత్వాన్ని మరుస్తున్నా ఒక కుక్క మాత్రం మరో కుక్కకు సాయం చేస్తూ మానవత్వాన్ని ప్రూవ్ చేసుకుంటోంది.

కళ్లు లేని ఒక కుక్కకు మరో కుక్క దారి చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అన్ని జంతువుల్లో విశ్వాసం చూపే జంతువుగా పేరున్న కుక్క తోటి కుక్కలపై కూడా విశ్వాసం చూపుతోంది.

టావో అనే గోల్డెన్‌ రిట్రీవర్‌ జాతికి చెందిన కుక్క గ్లకోమా వ్యాధి బారిన పడింది.గ్లకోమా వల్ల కుక్కకు వైద్యులు రెండు కళ్లను తొలగించారు.టావో యజమాని మెలానియా జాక్సన్ తనకు ఎంతో ఇష్టమైన టావోకు కళ్లు లేకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులను గమనించి సహాయం చేయాలని అనుకుంది.

కొన్ని రోజులు బాగా ఆలోచించి యజమాని ఆ కుక్కను ఒకో అనే మరో కుక్కకు జత చేశాడు.

ఒకో టావోకు దారిని చూపిస్తూ తను వెళ్లే మార్గంలో టావోను తీసుకెళుతోంది.సోషల్ మీడియాలో ప్రస్తుతం టావో, ఒకో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.కళ్లు కోల్పోయిన కుక్క సాధారణ కుక్కేం కాదు.ఆ కుక్కకు సోషల్ మీడియాలో ఖాతాలు ఉన్నాయి.

టావోకు ఇన్స్టాగ్రామ్ లో 13 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో టావో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇప్పుడు టావోతో పాటు ఒకో ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.మెలానియా జాక్సన్ టావోఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఇతరులు తమ కుక్కలు గ్లకోమా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారని అభిప్రాయపడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube