వినాయకుడికి నైవేద్యంగా గోల్డెన్ ఉండ్రాళ్ళు...ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం గ్యారంటీ.. !

వినాయకుడి పండగ అంటే చాలు పిల్లలకు, పెద్దలకు సందడే సందడి.వీధి వీధికి, సందు సందుకు ఎక్కడ చూసినా.

 Golden Men As An Offering To Ganesha . If The Price Is Very High, You Are Guaran-TeluguStop.com

గణపతి విగ్రహాలే మనకు దర్శనమిస్తుంటాయి.అలాగే ప్రతి ఇల్లు కూడా గణపతి పూజలో నిమగ్నం అయిపోయి ఉంటుంది.

వినాయకుడికి ఇష్టమైన పిండి వంటలు చేసి స్వామి వారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు.కాగా వినాయక స్వామికి ఇష్టమైన నైవేద్యాలలో ఉండ్రాళ్ళు కూడా ఒకటి.

ఈ ఉండ్రాళ్ళను కొంతమంది మోదక్ అని కూడా పిలుస్తుంటారు.వినాయక చవితికి ఉండ్రాళ్ళను ఎందుకు సమర్పిస్తారంటే గణపతికి ఉండ్రాళ్లంటే మహా ఇష్టం.

అందుకే భక్తజనం గణేష్ చతుర్థి నాడు వినాయకునికి ఉండ్రాళ్లను నైవేద్యంగా పెడుతుంటారు.

ప్రతి చోటా వినాయక చవితి పూజలు విశేషంగా జరుపుకుంటారు.

మరి ముఖ్యంగా ముంబైలో మాత్రం వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటుతాయి.ఈ క్రమంలోనే ముంబైలో ఓ వినాయకుడికి ఈసారి ఏకంగా గోల్డెన్ ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తుండటం విశేషం అనే చెప్పాలి.

గోల్డెన్ ఉండ్రాళ్ళు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.వినాయకుడు కదా అండి కొంచెం రిచ్ గా ఉండాలని ఒక స్వీట్ షాప్ యజమాని భావించి ఇలా గోల్డెన్ ఉండ్రాళ్ళను తయారు చేసాడు.

గోల్డెన్ ఉండ్రాళ్ళు మాత్రమే కాకుండా ఈ షాప్‌లో బంగారు, వెండి, జీడిపప్పు, అలా 25 రకాల వెరైటీ మెదక్ లు అందుబాటులో ఉన్నాయి.

Telugu Cost, Golden, Vinayaka, Latest-Latest News - Telugu

మాములుగా మనం స్వీట్ షాప్ లో కొనుక్కునే ఉండ్రాళ్ళు కేజీ 2 నుంచి 3 వందల దాక ధర ఉంటుంది.కానీ ఈ గోల్డెన్ ఉండ్రాళ్ళు మాత్రం ధర ఎక్కువే.ఈ స్వీట్ షాప్ లో తయారుచేసిన ఈ గోల్డెన్ ఉండ్రాళ్ళు మాత్రం కేజీ అక్షరాలా 12,000 వేల రూపాయలట.

ఏంటి ధర చూసి షాక్ అయ్యారా.ఎంతయినా అవి గోల్డెన్ ఉండ్రాళ్ళు కదా మరి అంత రిచ్ గానే ఉంటాయి.

ఎందుకంటే అవి బంగారు పూతతో చేశారు కాబట్టి.మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న ఓ స్వీట్ షాప్‌లోనే ఈ మోదక్‌లు మనకు లభ్యం అవుతున్నాయి.

ప్రస్తుతం ఈ గోల్డెన్ ఉండ్రాళ్ళు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.ధర ఎంత ఉన్నా పర్వాలేదు అని కొనుక్కునే వాళ్లు కొనుకుంటూనే ఉన్నారు.

ఈ గోల్డెన్ ఉండ్రాళ్ళకి ప్రజలు నుంచి విశేష స్పందన వస్తుందని సాగర్ స్వీట్ యజమాని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube