గుడ్ న్యూస్: భారీగా పతనమైన బంగారం, వెండి ధర.. ఎంత తగ్గిందంటే?

బంగారం.అసలు గత సంవత్సరం నుండి ఎంత భారీగా పెరిగింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఒకటి కాదు రెండు కాదు తులం బంగారంపై ఏకంగా 26 వేల రూపాయిలకుపైగా పెరిగింది.

వెండి ధర అయితే మరి దారుణంగా.నెల క్రితం వరకు 50 వేల రూపాయిలు ఉన్న వెండి ధర ఇప్పుడు ఏకంగా 76 వేల రూపాయిలకు చేరింది.

అంటే కేవలం నెల రోజుల్లో 26 వేలు పెరిగిందని అర్ధం.అలాంటి బంగారం ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి.

తులం బంగారం ధరపై వెయ్యి రూపాయిలు తగ్గింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై వెయ్యి రూపాయిలు తగ్గుదలతో 58,690 రూపాయలకు చేరింది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై వెయ్యి రూపాయిలు తగ్గుదలతో 53,800 రూపాయలకు చేరింది.

ఇంకా వెండి ధర కూడా ఇదే బాటలో నడిచింది.కేజీ వెండి ధరపై ఏకంగా 2,310 రూపాయిలు తగ్గింది.

దీంతో కేజీ వెండి ధర 74,200 రూపాయలకు చేరింది.అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం డిమాండ్ భారీగా తగ్గిందని అందుకే బంగారం ధరలు తగ్గినట్టు మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.

అయితే నిజానికి భారత్ లో కూడా బంగారం డిమాండ్ భారీగా పడిపోయింది.బంగారం ధరలు భారీగా పెరగటం వలన సామాన్య ప్రజలు బంగారంపై మక్కువ తగ్గి వెనుదిరుగుతున్నారు.

మరి ఈ బంగారం ధరలు మరింత ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి.

కెనడా నుంచి ఇండియాకి వెళ్లి అల్లుడిని సర్‌ప్రైజ్ చేసిన మేనమామ..