ఒక్కరోజులో భారీగా పతనమైన బంగారం.. కారణం అదేనా ?

బంగారం ధర.ఒక రోజు ఒకలా ఉంటుంది.

 Gold Rates Decreased In India-TeluguStop.com

భారతీయులకు ఎంతో ఇష్టమైన ఈ బంగారం.ఇప్పుడు సామాన్యులకు అసలు అందటం లేదు.

అసలు ఈ బంగారాన్ని మనం కొనగలమా? అనే సందేహంలో ప్రస్తుతం మధ్య తరగతి ప్రజలు ఉన్నారు.అయితే ఈ బంగారం ధరలు గత ఆరు రోజుల నుండి పెరుగుతూ వచ్చింది.

అలాంటి ఈ బంగారం ధర ఒక్క రోజులో అమాంతం పడిపోయింది

వారం రోజుల నుండి పరుగులు పెడుతు వచ్చిన బంగారం ధర కేవలం నిన్న ఒక్క రోజులో ఏకంగా 12 వందల రూపాయిలు తగ్గింది.ఈరోజు కూడా బంగారం ధర భారీగానే తగ్గింది.బంగారం ధరపై దాదాపు 300 రూపాయిలు తగ్గి రూ.42,480కు క్షిణించింది.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ? ఐదు రోజుల్లో 3 వేల రూపాయిలు పెరిగి రెండు రోజుల్లో 15వందలు తగ్గింది

బంగారం ధర భారీగా పడిపోగా వెండి ధర కూడా భారీగానే పతనం అయ్యింది.కేజీ వెండి ధర 11 వందలు తగ్గి 50 వేల రూపాయలకు చేరింది.

అయితే బంగారం ధర ఒక్కసారిగా భారీగా పతనం అవ్వడానికి కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్ భారీగా తగ్గింది అని.అది భారత్ లోను పడింది అని మార్కెట్ నిపుణులు చెప్పారు.ఏది ఏమైనా బంగారం ధర ఇలా భారీగా పతనమవ్వడం పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube