భారీగా తగ్గిన బంగారం ధర.. మరింత తగ్గే అవకాశం!

బంగారం ధరలు ఎంత దారుణంగా పెరిగాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కారణం కోవిడ్ అయినా మరేదైనా 2023, 2024 లో పెరగాల్సిన బంగారం ధరలు ఇప్పుడే పెరిగాయ్.

 Gold Rate Reduced In India  Gold Rate, Silver Rate, Decreased In India, Internat-TeluguStop.com

అలాంటి ఈ బంగారం ధరలు మొన్న ఆగస్ట్ వరకు భారీగా పెరిగాయ్.ఇప్పుడు మాత్రం రోజుకు వంద, రెండు వందలు తగ్గుతూ సామాన్యులకు ఊరటనిస్తోంది.

దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు పడుతూ లేస్తూ వస్తున్నాయ్.నిన్నటికి నిన్న భారీగా పెరిగిన బంగారం ధర ఈరోజు అమాంతం పడిపోయింది.అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర ఏకంగా 1957 డాలర్లకు తగ్గిపోయింది.దీంతో భారత్ లో బంగారం ధరలు తగ్గిపోయాయి.నేడు పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 65 రూపాయిలు తగ్గుదలతో రూ.49,170కు చేరింది.

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 80 రూపాయిల తగ్గుదలతో 53,640 రూపాయిలకు చేరింది.ఇక వెండి ధర కుడి అలాగే కొనసాగుతుంది.కేజీ వెండి ధర 1299 రూపాయిల తగ్గుదలతో రూ.67,050లకు చేరింది.అయితే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం డిమాండ్ భారీగా తగ్గిపోవడంతో బంగారం ధర కేవలం నెల రోజుల్లోనే 5 వేల రూపాయిలు తగ్గింది.ముందున్న రోజుల్లో కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube