హీరో అజిత్ కు గోల్డ్ మెడల్.. ఎందుకంటే..?!

మన తెలుగు రాష్ట్రాల్లో కంటే తమిళ సినీ అభిమానులు వారి సినీ రంగాన్ని ఎంతగానో అభిమానిస్తారు అన్న సంగతి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎక్కడా లేనంతగా ఏ రాష్ట్రంలో చేయని విధంగా తమిళనాడు రాష్ట్రంలో హీరోయిన్లకు వారి అభిమాన సంఘం వారు ఏకంగా గుడులు కట్టి అందులో వారి విగ్రహాలను ప్రతిష్ట చేసి వారికి దూప, నైవేద్యాలు అందజేస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం.

 Gold Medal For Hero Ajith Because, Hero Ajith, Gold Medal, Tamilnadu State, Shoo-TeluguStop.com

ఏ సినిమా ఇండస్ట్రీలో లేనివిధంగా తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో హీరోయిన్లకు పెద్దఎత్తున అభిమాన సంఘాలను ఏర్పాటు చేసుకొని వారికి సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.ఇందులో ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్స్ అయిన రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ దళపతి, హీరో అజిత్ ఇలా చెప్పుకుంటూ వెళితే తమిళ సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు పెద్దఎత్తున అభిమానుల తాకిడి ఉంటుంది.

అభిమానుల ఆరాధ్య దైవమైన హీరో లకు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే చాలు ఆ సినీ అభిమానులకు పండుగ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు.ఇక అసలు విషయంలోకి వెళితే.

తాజాగా హీరో అజిత్ తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించిన ఆరో రాష్ట్ర స్థాయి షూటింగ్ ఛాంపియన్ షిప్ కాంపిటీషన్‌ లో గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకున్నాడు.ఇక సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న హీరో అజిత్ మరోవైపు స్పోర్ట్స్ లో కూడా ఇలా గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకోవడంతో అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలుగచేస్తుంది.

  వాస్తవానకి ఈ షూటింగ్ పోటీలు రైఫిల్ పిస్టల్ కేటగిరి లో నిర్వహించారు.సినిమాల్లోనే కాకుండా స్పోర్ట్స్ లో కూడా మంచి ప్రావీణ్యం హీరో అజిత్ కు ఉండడం చెప్పుకోదగ్గ విషయం.

ఇది ఇలా ఉండగా సినిమా ప్రపంచంలో అభిమానులు హీరో అజిత్ తలా అని ముద్దుగా పిలుచుకునే సంగతి మనకు తెలిసిన విషయమే.గతంలో కూడా రేస్ కార్లు నడుపుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు అజిత్.

ఇటీవల కాలంలో సైకిల్ మీద దేశం మొత్తం తిరిగి వార్తలలోకి ఎక్కాడు.అలాగే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎవరైనా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి ముందు ఉంటాడు హీరో అజిత్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube