బంగారం( Gold ) అనేక రూపాల్లో అందుబాటులో ఉంటుంది.గోల్డ్ షాపుల్లో వివిధ రకాల డిజైన్లతో పాటు బంగారపు బిస్కెట్స్, గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్ రూపంలో మనకు లభిస్తాయి.
అలాగే ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో కూడా బంగారాన్ని దాచుకోవచ్చు.ఇందుకుగాను అనేక ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా బంగారంపై పెట్టబడి పెట్టొచ్చు.పేపర్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్, మ్యూచువల్ ఫండ్స్‌లోని గోల్డ్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్, డిజిటల్ గోల్డ్ వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టవచ్చు.

అయితే తాజాగా గోల్డ్ కాయిన్స్( Gold Coins ) కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్ మంచి అవకాశం కల్పిస్తోంది.రూ.వెయ్యి నుంచే గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తోంది.22 లేదా 24 క్యారెట్లలో బంగారపు కాయిన్స్‌ను వెబ్‌సైట్ లో మనం కొనుగోలు చేయవచ్చు, అలాగే గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్( Amazon ) అనేక ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తోంది.బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో పాటు వివిధ రకాల ఆఫర్లు ఇస్తోంది.దీని ద్వారా మీరు రూ.వెయ్యి వరకు డిస్కౌంట్ పొందవచ్చు.0.1 గ్రాముల నుంచి 25 గ్రాముల వరకు అమెజాన్ ద్వారా గోల్డ్ కాయిన్స్‌ను కొనుగోలు చేయవచ్చు.

సాధారణ బంగారపు కాయిన్లతో పాటు దేవుడి బొమ్మలు ముద్రించిన వాటిని కూడా కొనుగోలు చేయవచ్చు.వీటికి బీఐఎస్ హాల్ మార్క్( BIS ) కూడా వస్తుంది.మీరు అమెజాన్ లో గోల్డ్ కాయిన్ ను కొనుగోలు చేస్తే 10 రోజుల్లో ఇంటికి డెలివరీ వస్తోంది.అమెజాన్ కల్పిస్తున్న ఈ ఆఫర్ ద్వారా రూ.10 వేలు పెట్టి గోల్డ్ కాయిన్ కొంటే దాదాపు రూ.వెయ్యి తగ్గింపు లభిస్తుంది.అయితే ఇంటికి డెలివరీ వచ్చిన తర్వాత అన్నీ చెక్ చేసుకోవాలి.ప్యాకేజీ కరెక్ట్‌గా ఉందా.? లేదా? అనేది చూసుకోవడం మంచిది.