మరోసారి షాక్ ఇచ్చిన బంగారు, వెండి ధరలు...!

నాలుగు రోజుల కింద వరకు అడ్డూ అదుపూ లేకుండా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు గత నాలుగు రోజుల నుండి క్రమ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.నాలుగు రోజుల క్రితం గరిష్ఠంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 57 వేలకు పైగా చేరింది.

 Gold And Silver Rates Increased,gold, Silver, Stock Market, Shock, Price, Hydera-TeluguStop.com

ఇకపోతే తాజాగా బుధవారం నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,300 కు చేరుకుంది.అంటే కేవలం నాలుగు రోజుల్లో బంగారం ధర రూ.4 వేల కు పైగా తగ్గింది.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా నేల చూపులు చూశాయి.దాదాపు కిలో వెండి ధర ఏకంగా 75 వేల వరకు వెళ్లిన తర్వాత కేవలం నాలుగు రోజుల్లో వెండి కిలో ఏకంగా రూ.9 వేల వరకు తగ్గింది.దీంతో ప్రస్తుతం మార్కెట్లో వెండి ధర రూ 65 వద్ద ట్రేడ్ కొనసాగుతోంది.దీనికి ముఖ్య కారణం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా క్షీణించాయి.అంతేకాకుండా కరోనా వైరస్ సంబంధించిన వ్యాక్సిన్ వచ్చిందని తెలపడంతో ఇన్వెస్టర్లు బంగారు, వెండి పై అత్యధిక లాభాలు స్వీకరించిన కారణంగా అమ్మకాలు మొదలుపెట్టారు.దీంతో పసిడి, వెండి ధరలు క్రమక్రమంగా తగ్గాయి.

ఇకపోతే గురువారం నాడు బంగారం ధరలు మరోసారి పసిడి, వెండి ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 820 రూపాయలు పెరిగి రూ.55,500 కు చేరుకుంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.920 పెరిగి రూ.51, 050 కు చేరుకుంది.వీటితో పాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది.కేజీ వెండి ధర ఏకంగా 2000 రూపాయలు పెరిగి రూ.67000 కు చేరుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube