భారీగా పతనమవుతున్న పసిడి, వెండి ధరలు…!  

gold and silver prices drop, Gold rates, Delhi Market, Silver Prices Reduced, Stock market - Telugu Delhi Market, Gold, Gold And Silver Prices Drop, Gold Lovers, Gold Prices, Gold Rates, Silver Prices, Silver Prices Reduced, Stock Market, Telugu States

అంతర్జాతీయంగా రోజురోజుకీ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.గత మూడు రోజుల నుండి బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

TeluguStop.com - Gold And Silver Prices Falling Sharply

గత 20 రోజుల ముందు వరకు సామాన్యులకు అందని విధంగా పసిడి, వెండి ధరలు ఆకాశాన్ని అంటాయి.ఇక నేటి బంగారం విషయానికొస్తే.

మన తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ .760 రూపాయల వరకు తగ్గింది.దీంతో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.52,470 కు చేరుకోగా, మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.700 రూపాయలు తగ్గి రూ 48,100 కు చేరుకుంది.ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో ను బంగారం ధరలు గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తుండగా, వెండి ధర కూడా గత నాలుగు రోజుల నుంచి పతనమైతూనే ఉంది.ఇక ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.540 రూపాయల వరకు తగ్గి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.53460 కి చేరుకుంది.అలాగే 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే పది గ్రాముల పై రూ.500 వరకు తగ్గి రూ.49 వేలకు చేరుకుంది.

TeluguStop.com - భారీగా పతనమవుతున్న పసిడి, వెండి ధరలు…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక మరోవైపు వెండి ధర కూడా బంగారాన్ని ఫాలో అయిపోతుంది.వరుసగా నాలుగో రోజు వెండి ధర క్షీణించింది.ఇక తాజాగా మార్కెట్లో కేజీ వెండి ధర ఏకంగా రూ.1600 వరకు క్షీణించింది.దీనితో కేజీ వెండి ధర రూ.49000 కు చేరుకుంది.మొత్తంగా పసిడి కొనాలనుకునే వారికి ఇది సరైన సమయం.నిపుణుల అంచనా మేరకు 2020 డిసెంబర్ చివరినాటికి బంగారం తారా స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.కాబట్టి ఎవరైనా పసిడి కొనాలనుకునేవారు త్వరపడి కొనడం మంచిది.లేకపోతే మళ్లీ ధరలు పెరిగితే బాధ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

#Silver Prices #Gold Prices #GoldAnd #Stock Market #Gold

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Gold And Silver Prices Falling Sharply Related Telugu News,Photos/Pics,Images..