ఈ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక…  

తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు “ముత్యాల సుబ్బయ్య” దర్శకత్వం వహించినటువంటి “గోకులంలో సీత” అనే చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ స్నేహితుడి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన  ప్రముఖ సీనియర్ హీరో “హరీష్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే హరీష్ అప్పట్లో తన ఇన్నోసెంట్ ఫేస్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

TeluguStop.com - Gokulamlo Seetha Movie Fame Hero Hareesh Real Life News

అంతేగాక హీరో హరీష్ నటించినటువంటి పలు చిత్రాలను కన్నడ, తమిళ, హిందీ, తదితర భాషలలో కూడా  దర్శక నిర్మాతలు రీమేక్ చేశారంటే ఈయన కి ఉన్నటువంటి క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

అయితే  వరుస అవకాశాలతో కెరియర్  దూసుకుపోతున్న సమయంలో పలు చిత్రాల కథల విషయంలో కొంతమేర అవగాహన లోపించడంతో హరీష్ బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫ్లాపులను ఎదుర్కొన్నాడు.

TeluguStop.com - ఈ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కి ప్రేక్షకులను అలరించలేకపోయాడు.దీంతో కొంతకాలం నటనకి స్వస్తి చెప్పి హరీష్ పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. దీంతో ఇక పూర్తిగా  తన సినీ కెరీర్ కి స్వస్తి చెప్పి వ్యాపార రంగంపై దృష్టి సాధించాడు.

ఈ క్రమంలో సంగీత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.

అయితే ఈ మధ్యకాలంలో హీరో హరీష్ మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నాడని పలు వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు హరీష్ మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు.

అయితే తెలుగులో హీరో హరీష్ నటించిన టువంటి ప్రేమ ఖైదీ, గోకులంలో సీత, మాధవయ్యగారి మనవడు, ఏవండీ ఆవిడ వచ్చింది, తిరంగా, కూలి నెంబర్ వన్,  తదితర చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

కాగా తెలుగులో హరీష్ చివరగా ప్రముఖ స్వర్గీయ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించినటువంటి “పెళ్లయింది కానీ…!” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కనిపించాడు.

ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు తెలుగులో నటించలేదు.అయితే హీరో హరీష్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, తదితర భాషలలో దాదాపుగా 250 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాడు కానీ.

సినిమా కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడంతో తన సినీ కెరీర్ లో నిలదొక్కుకోలేకపోయాడు.

#GokulamloSeetha #GokulamloSeetha #Prema Khaidi #Hareesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Gokulamlo Seetha Movie Fame Hero Hareesh Real Life News Related Telugu News,Photos/Pics,Images..