అంత మందితో ఢిల్లీకి వెళ్తున్న ఈట‌ల..? కీల‌క నేత‌లు కూడా!

ఈట‌ల రాజేంద‌ర్ రాజ‌కీయాలు ఇప్ప‌టి నుంచి స‌రికొత్త మ‌లుపు తిర‌గ‌బోతున్నాయి.ఈ రోజు ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే.

 Going To Delhi With So Many People-TeluguStop.com

ఇక త‌రువాయి బీజేపీలో చేర‌డ‌మే మిగిలింది.అయితే బీజేపీ ఈట‌లకు ఎంత ప్రాముఖ్య‌త ఇస్తుందో చూస్తూనే ఉన్నాం.

గ‌తంలో ఏ నేత‌కూ ఇవ్వ‌నంత ప్రాముఖ్య‌త ఈట‌ల రాజేంద‌ర్‌కు ఇస్తున్నారు క‌మ‌ల‌నాథులు.ఈట‌ల రాక‌తో త‌మ పార్టీ బ‌లం పెరుగుతుంద‌ని భావిస్తున్నారు.

 Going To Delhi With So Many People-అంత మందితో ఢిల్లీకి వెళ్తున్న ఈట‌ల.. కీల‌క నేత‌లు కూడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈట‌ల రాజేంద‌ర్ కూడా త‌న బ‌ల‌మేంటో చూపించేందుక సిద్ధ‌మ‌వుతున్నారు.ఇప్ప‌టికే బీజేపీ నేత‌ల‌ను త‌న ఇంటికి పిలిచి త‌న బ‌ల‌గం చూపించారు.పెద్ద లీడ‌ర్లు కూడా ఈట‌ల ఇంటికే వ‌స్తున్నారు.కాగా ఇప్పుడు జూన్ 14న ఢిల్లీకి వెళ్లి న‌డ్డా స‌మ‌క్షంలో కండువా క‌ప్పుకుంటున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌.

ఇక ఇక్క‌డ కూడా త‌న వెంట భారీగా బ‌ల‌గాన్ని తీసుకెళ్తున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌.పెద్ద ఎత్తున ముఖ్య నేత‌లు ఈట‌ల వెంట ప‌య‌న‌మ‌వుతున్నారు.

Telugu @bandisanjay_bjp, Eetala Rajendhar-Telugu Political News

దాదాపు 200మంది స‌భ్యులు ఈట‌ల వెంట వెళ్తున్నారు.ఇందులో ముఖ్య నేత‌లైన ఏనుగు రవీంద‌ర్‌రెడ్డి, తుల ఉమ‌, అశ్వ‌త్థామ‌రెడ్డి లాంటి నాయ‌క‌లు కూడా ఉన్నారు.వీరంద‌రితో న‌డ్డా స‌మ‌క్షంలో బీజేపీలో చేరుతున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌.దీంతో టీఆర్ ఎస్‌కు త‌న బ‌ల‌మేంటో చూపించాల‌ని ఈట‌ల భావిస్తున్నారు.అలాగే బీజేపీలో కూడా త‌న బ‌లం పెంచుకునేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు.ఇక ఈ కార్య‌క్ర‌మానికి బీజేపీ పెద్ద‌లు కూడా ప‌య‌న‌మై వెళ్తున్నారు.

అయితే ఈట‌ల‌కు ఎలాంటి హామీ ఇస్తార‌నేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.కాగా ఈట‌ల చేరిక‌తో బీజేపీ బ‌లం భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.

ఈట‌ల గెలిస్తే మాత్రం ఉత్త‌ర తెలంగాణ మొత్తం బీజేపీ చేతుల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది.ఇది త‌ర్వాత వ‌చ్చే ఎన్నిక‌ల‌పై భారీగా ప్ర‌భావం చూపుతుంది.

చూడాలి మ‌రి ముందు ముందు ఎలాంటి రాజ‌కీయాలు ఉంటాయో.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు