ఆంక్షల ఎత్తివేత.. ప్రయాణీకుల్ని బాదుడే బాదుడు, చుక్కలనంటుతున్న యూఈఏ ఫ్లైట్ ఛార్జీలు

కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులకు తిరిగి వచ్చేందుకు యూఏఈ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ మేరకు గురువారం (ఆగస్టు 5) నుంచి ప్రవాసులు యూఏఈకి రావొచ్చని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.

 Going Back To Uae Costs A Bomb Likely Relief From August 5-TeluguStop.com

ఇక ఈ ప్రకటన రావడంతో ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు.ఇన్నాళ్ల తమ ఎదురుచూపులు ఫలించినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు.

దీంతో యూఏఈ తిరిగి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకునేందుకు ఎగబడ్డారు.అయితే ఇదే అదనుగా ప్రయాణీకుల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి విమానయాన సంస్థలు.

 Going Back To Uae Costs A Bomb Likely Relief From August 5-ఆంక్షల ఎత్తివేత.. ప్రయాణీకుల్ని బాదుడే బాదుడు, చుక్కలనంటుతున్న యూఈఏ ఫ్లైట్ ఛార్జీలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎలాంటి మొహమాటం లేకుండా టికెట్ ధరలను అమాంతం పెంచేశాయి.ప్రస్తుతం విమాన టికెట్ ధరలు సాధారణ రోజుల్లో కంటే 300 రేట్లు అధికంగా ఉన్నట్లు సమాచారం.

గతంలో ఢిల్లీ-దుబాయ్ వన్‌వే టికెట్ ధర 750-900 దిర్హమ్స్ (ఎకనామీ క్లాస్) ఉండేది.కానీ, ప్రస్తుతం అది 2 వేల దిర్హమ్స్‌కు చేరుకుంది.

ఇదే విధంగా మిగతా తరగతి టికెట్ ధరలు కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

కాగా, భారత్‌తో పాటు మరో పది దేశాల ట్రాన్సిట్ విమానాలకు యూఏఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ట్రాన్సిట్ అనుమతులు పొందిన దేశాల జాబితాలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, నైజీరియా, ఉగాండా, వియత్నాం, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, నేపాల్ ఉన్నాయి.కరోనా వల్ల ఆయా దేశాల్లో చిక్కుకున్న ప్రవాసులు ఈ విమానాల ద్వారా తిరిగి యూఏఈ రావొచ్చని పేర్కొంది.

అయితే, రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.అలాగే యూఏఈ ప్రయాణానికి 14 రోజుల ముందు రెండో డోసు తీసుకున్న ప్రయాణికులు కూడా రావొచ్చునని.ఇలాంటి వారు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సర్టిఫికేట్ చూపించాలని తెలిపింది.ప్రధాన రంగాలైన హెల్త్ వర్కర్స్ (వైద్యులు, నర్సులు, టెక్నిషీయన్స్), టీచింగ్ స్టాఫ్(యూనివర్శిటీ, కళాశాల, పాఠశాల, ఇతర విద్యా సంస్థల్లో పనిచేస్తున్నవారు) యూఏఈ తిరిగి రావొచ్చని షనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌సీఈఎంఏ) వెల్లడించింది.

ఇక కొత్త మార్గదర్శకాల ప్రకారం యూఏఈ రావాలనుకునే ప్రయాణీకులు.ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.టీకా సర్టిఫికేట్‌లతో పాటు ప్రయాణికులు బయల్దేరే 48 గంటల లోపే ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్‌ను సమర్పించాలి.అలాగే వారు విమానం ఎక్కేముందు కూడా ల్యాబ్ టెస్ట్ నిర్వహించబడుతుంది.

యూఏఈ చేరుకున్న వెంటనే మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించి.హోం క్వారంటైన్‌కు తరలిస్తారు.

#OneWay #Delhi-Dubai #GoingBack #Transit Flights #LikelyRelief

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు