బాలయ్య దెబ్బకు గూగూల్ వెనకడుగు  

Gogle Backwards To Balayya Effect-

ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ బుల్లె పెట్టె అదేనండి. సెల్ ఫోన్ ఉంటోంది...

బాలయ్య దెబ్బకు గూగూల్ వెనకడుగు -Gogle Backwards To Balayya Effect

ఏ చిన్న విషయం గురించి తెలుసుకోవాలన్నా వెంటనే గూగుల్, వికీపీడియా లో సెర్చ్ చేయడం అన్నం తినడం ఎలా అలవాటు అయ్యిందో అలా అలవాటు అయిపొయింది అందరికి . అయితే గూగూల్ లో దొరికే సమాచారం అంతా నూటికి నూరు శాతం కరెక్టేనా అంటే సమాధానం కోసం వెతుక్కోవాల్సిందే.

ఇటీవల నందమూరి హీరో బాలకృష్ణ డెత్ డేట్‌ను చూపెట్టి గూగుల్ వివాదంలో పడింది. నందమూరి బాలకృష్ణకు సంబంధించిన సమాచారాన్ని వికీపీడియాలో తప్పుగా చూపిస్తోంది.

బాలయ్య 1913 నవంబర్‌ 2న జన్మించి, 1995 జూలై 19న మరణించినట్లు చూపిస్తోంది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై బాలకృష్ణ ఫ్యాన్స్ గూగుల్‌పై మండిపడుతున్నారు. వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోకపోతే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మండిపడుతున్నారు..

దీంతో గూగుల్ ఆ తప్పుడు సమాచారాన్ని తొలగించింది.

గూగుల్‌లో ఇలాంటి తప్పులు దొర్లడం కొత్తేమీకాదు. గతంలో కూడా గూగుల్ ఇలాంటి పొరపాట్లు చాలానే చేసింది. ప్రస్తుత ప్రధానినరేంద్ర మోడీని భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అని చూపించడం, మహేష్ బాబు గురించి సెర్చ్ చేస్తే హాలీవుడ్ హీరోను చూపించడం వంటివి చాలానే వున్నాయి.