బాలయ్య దెబ్బకు గూగూల్ వెనకడుగు

ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ బుల్లె పెట్టె అదేనండి.సెల్ ఫోన్ ఉంటోంది.

 Gogle Backwards To Balayya Effect-TeluguStop.com

ఏ చిన్న విషయం గురించి తెలుసుకోవాలన్నా వెంటనే గూగుల్, వికీపీడియా లో సెర్చ్ చేయడం అన్నం తినడం ఎలా అలవాటు అయ్యిందో అలా అలవాటు అయిపొయింది అందరికి .అయితే గూగూల్ లో దొరికే సమాచారం అంతా నూటికి నూరు శాతం కరెక్టేనా అంటే సమాధానం కోసం వెతుక్కోవాల్సిందే.

ఇటీవల నందమూరి హీరో బాలకృష్ణ డెత్ డేట్‌ను చూపెట్టి గూగుల్ వివాదంలో పడింది.నందమూరి బాలకృష్ణకు సంబంధించిన సమాచారాన్ని వికీపీడియాలో తప్పుగా చూపిస్తోంది.బాలయ్య 1913 నవంబర్‌ 2న జన్మించి, 1995 జూలై 19న మరణించినట్లు చూపిస్తోంది.ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.దీనిపై బాలకృష్ణ ఫ్యాన్స్ గూగుల్‌పై మండిపడుతున్నారు.వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోకపోతే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మండిపడుతున్నారు.

దీంతో గూగుల్ ఆ తప్పుడు సమాచారాన్ని తొలగించింది.

గూగుల్‌లో ఇలాంటి తప్పులు దొర్లడం కొత్తేమీకాదు.గతంలో కూడా గూగుల్ ఇలాంటి పొరపాట్లు చాలానే చేసింది.ప్రస్తుత ప్రధానినరేంద్ర మోడీని భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అని చూపించడం, మహేష్ బాబు గురించి సెర్చ్ చేస్తే హాలీవుడ్ హీరోను చూపించడం వంటివి చాలానే వున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube