గాడ్సే దేశ భక్తుడు అయితే గాంధీజీ ఉగ్రవాదా! మరో సారి సాద్వీ వివాదం  

గాడ్సే దేశభక్తుడు అంటున్న సాద్వీ.

Godse A \'deshbhakt\', Says Pragya Thakur-congress,godse Deshbhakt Pragya Thakur,lok Sabha Elections

బీజేపీ పార్టీలో సన్యాసులు ఎక్కువైపోయి, వారు చేసే పనులు, మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉంటున్నాయో ప్రస్తుతం దేశ రాజకీయాలలో చూస్తూ ఉన్నాం. మాలెగావ్ బాంబు పేలుళ్ళలో ఎ1 ముద్దాయిగా ఉండి కొంత కాలం శిక్ష అనుభవించి, తాజాగా నిర్దోషిగా బయటకి వచ్చి తన భావజాలంకి దగ్గరగా ఉండే బీజేపీ పార్టీలో చేసి ఎంపీగా పోటీ చేస్తున్న సాద్వీ ప్రజ్ఞా ఠాగూర్ చేస్తున్న వివాదాస్పద వాఖ్యలతో మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఎన్నికల గెలుపు సంగతి ఎలా ఉన్న ఆమె మాటలు విన్న ఎవరైన ఇలాంటి వ్యక్తిని గెలిపిస్తే ఇక హిందుత్వ బావజాలంతో మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. .

గాడ్సే దేశ భక్తుడు అయితే గాంధీజీ ఉగ్రవాదా! మరో సారి సాద్వీ వివాదం-Godse A 'deshbhakt', Says Pragya Thakur

తాజాగా మరో సారి సాద్వీ వివాదాస్పద వాఖ్యలతో రెచ్చిపోయింది.

ఆ మధ్య గాడ్సే మొదటి హిందూ ఉగ్రవాది అని అన్న మాటలకి కౌంటర్ గా ఆమె గాదె దేశభక్తుడు అని చెప్పుకొచ్చింది. గాడ్సేని ఉగ్రవాదితో పోల్చిన వ్యక్తులకి ప్రజలు బుద్ధి చెబుతారని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియా వైరల్ గా మారడంతో గాడ్సే దేశభక్తుడు అయితే అతని చేతిలో చనిపోయిన గాంధీజీ ఉగ్రవాది అని మీ భావనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరో వైపు ఆమె మాటలపై బీజేపీ పార్టీ నేతలు కూడా విరుచుకుపడుతూ సాద్వీ వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.