లేడీ సూపర్ స్టార్ కు బర్త్ డే విషెస్ చెప్పిన 'గాడ్ ఫాదర్'!

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటుంది.ఈమె ప్రెసెంట్ స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తుంది.

 Godfather Team Wishes Nayanthara A Very Happy Birthday, Chiranjeevi,chiranjeevi-TeluguStop.com

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నయనతార అంటే తెలియని వారు ఉండరంటే పెద్ద అతిసయోక్తి కాదేమో.అంతగా ఈ బ్యూటీ ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.

నయనతార మొదట్లో గ్లామర్ హీరోయిన్ గా అభ్యన్తరం చెప్పకుండా నటించింది.

తెలుగులో కూడా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

అయితే ఈ మధ్య కాలంలో నయనతార గ్లామర్ పాత్రలకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.నటనకు ఆస్కారం ఉన్న పాత్రలపైనే ఈ అమ్మడు ద్రుష్టి పెట్టింది.

ఈ క్రమంలోనే వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వరుస హిట్స్ కూడా అందుకుంది.అంతేకాదు ఈ బ్యూటీ అడిగినంత రెమ్యునరేషన్ కూడా ఇవ్వడానికి నిర్మాతలు వెనకడుగు వేయలేదు.

Telugu Chiranjeevi, God, Godfatherwishes, Hbd Nayanatara, Mohan Raja, Nayanatara

సౌత్ లోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా నయనతార రికార్డ్ క్రియేట్ చేసింది.ఇక ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువనే ఉంది.ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా సోషల్ మీడియాలో నయనతార ఫ్యాన్స్ విషెష్ చెబుతూ సందడి చేస్తున్నారు.ఇక ఈమె చేస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్ లు కూడా ఇస్తున్నారు మేకర్స్.

Telugu Chiranjeevi, God, Godfatherwishes, Hbd Nayanatara, Mohan Raja, Nayanatara

ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా మేకర్స్ కూడా నయనతారకు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్ ను విడుదల చేసారు.తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్‘ సినిమాకు ఇది రీమేక్ గా రాబోతుంది.ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube