గాడ్ ఫాదర్ రివ్యూ: అదరగొట్టిన చిరు!

డైరెక్టర్ మోహన్ రాజా, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సినిమా గాడ్ ఫాదర్.పొలిటికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నయనతార, బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు.

 Godfather Review Abandoneda Chiru , Review, Chiru, Nayanthara, Salman Khan, Saty-TeluguStop.com

అంతేకాకుండా సత్యదేవ్ కంచరాన, గద్దర్, గంగవ్వ, అనసూయ, ఇంద్రజిత్ సుకుమారన్ తదితరులు నటించారు.సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొనిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఆర్ బి చౌదరి, ఎన్వి ప్రసాద్ నిర్మాతలుగా చేశారు.

ఇక ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు.నిరోవ్ షా సినిమాటోగ్రఫీ అందించాడు.

ముఖ్యం గా పొలిటికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన.ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.

ఇక ఈ సినిమాను మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ను గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు.ఇక ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈరోజు ఈ సినిమా థియేటర్ లో రాగా ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో చూద్దాం.ఇక చిరంజీవికి ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

Telugu Anasuya, Chiru, Gaddar, Gangavva, Godfather, Indrajith, Nayanthara, Revie

కథ:

ఆంధ్రప్రదేశ్ అధికారి పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి కూతురు నయనతార.ఆ ముఖ్యమంత్రి కి బాగా దగ్గర వ్యక్తి చిరంజీవి.చిరంజీవి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటాడు.ఇక పదవిలో ఉన్న నయనతార తండ్రి చనిపోవడంతో ఆ తర్వాత సీఎం పోస్టును ఎవరెవరికి ఇవ్వాలి అని చర్చలు చేస్తారు.

కూతురుగా నయనతారకు ఆ అవకాశం ఉంటుంది.కానీ రాజకీయాలకు పూర్తి విరుద్ధం ఆమె.దాంతో తన రెండవ భర్తకు సీఎం అయ్యే అవకాశం ఉంటుంది.కానీ అతను పెద్ద క్రిమినల్.

ఇక సీఎం కొడుకుకు కూడా సీఎం అయ్యే అవకాశం ఉంటుంది.కానీ అతడు విదేశాలలో ఉంటాడు.

ఆ తర్వాత దగ్గర వ్యక్తి అయిన చిరంజీవికి కూడా సీఎం పదవి అవకాశం ఉంటుంది.కానీ నయనతార అడ్డుగా ఉంటుంది.

ఇక సీఎం చనిపోవడంతో చిరంజీవి ఆఖరి చూపు కోసం వస్తుండగా.నయనతార ఆపే ప్రయత్నం చేస్తుంది.

కానీ చివరికి చిరంజీవిని పార్దివ దేహాని చూడటానికి వస్తాడు.అయితే ముఖ్య మంత్రి చివరి చూపుకు వచ్చిన వాళ్లంతా చిరంజీవి నడుస్తూ వస్తుండగా ఆయన వస్తున్నారని ఎంతో అభిమానం చూపిస్తారు.

అలా చిరంజీవిను నయనతార ఎందుకు అడ్డు పడుతుంది.గతంలో వారిద్దరి మధ్య ఏం జరిగింది.అసలు వారికి ఏ బంధం ఉంది ముఖ్యంగా నయనతార మొదటి భర్త ఎవరు అనే ఈ ట్విస్ట్ లను మిగతా సినిమాలో చూడవచ్చు.

నటినటుల నటన:

మెగాస్టార్ చిరంజీవి నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎప్పటి లాగానే ఆధారగొట్టాడు చిరు.ఇక నయనతార మాత్రం మరోసారి న్యాయం చేసింది.తన లుక్ మాత్రం చాలా బాగుంది.బాలీవుడ్ స్టార్ సల్మాన్ కూడా బాగా నటించాడు.మిగతా నటి నటులు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

డైరెక్టర్ ఈ సినిమాకు మార్పులు చేసిన కూడా ఎందుకో కాస్త నిరాశగా అనిపించింది.ఇక తమన్ అందించిన మ్యూజిక్ బాగుంది.నిరవ్ షా అందించిన సినిమాటోగ్రఫీ.మిగతా టెక్నికల్ విభాగాలు పూర్తిగా న్యాయం చేశాయి.

Telugu Anasuya, Chiru, Gaddar, Gangavva, Godfather, Indrajith, Nayanthara, Revie

విశ్లేషణ:

లూసిఫర్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమాను కానీ కొన్ని మార్పులతో ఈ సినిమాను చూపించాడు దర్శకుడు.చిరు పాత్రను బాగా చూపించాడు.చాలా వరకు సినిమా కథ బాగుంది.

ప్లస్ పాయింట్స్:

చిరు, నయన నటన, యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే డైలాగులు, సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ,

మైనస్ పాయింట్స్:

కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా అనిపించాయి.

బాటమ్ లైన్:

సినిమా బాగుందని చెప్పవచ్చు.ముఖ్యం మార్పులతో కథను అదరగొట్టేసాడు డైరెక్టర్.చిరు మాత్రం బాగా నటించాడు.

రేటింగ్:

3/5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube