మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు మోహన్ రాజా దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.
భారీ అంచనాలున్న ఈ సినిమా చిత్రీకరణ మొన్నటి వరకు ఊటీలో జరిగింది.చేయికి సంబంధించి ఇబ్బంది కారణంగా చిరంజీవి సినిమా షూటింగ్ మద్యలో వదిలేసి వెనక్కు వచ్చాడు.
సినిమా ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి.ఇలాంటి సమయంలో గాడ్ ఫాదర్ ను పూర్తి చేయకుండా భోళా శంకర్ సినిమా ను పట్టాలెక్కించబోతున్న నేపథ్యంలో అసలేం జరుగుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
నెట్టింట ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
చిరంజీవి భోళా శంకర్ సినిమా చిత్రీకరణ నవంబర్ 15 నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే.
ఈ సమయంలో గాడ్ ఫాదర్ సినిమా ఎప్పటి నుండి ప్రారంభం అవ్వబోతుంది అంటూ మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.సినిమా లు రెండు ఒకే సారి చిత్రీకరణ చేస్తే ఔట్ పుట్ ఎలా వస్తుంది అనేది కాస్త గందరగోళంగా ఉంది.
చిరంజీవి మాత్రమే కాకుండా గత కొంత కాలంగా ఇతర హీరోలు అంతా కూడా ఒక సినిమా తర్వాత ఒక సినిమా అన్నట్లుగా చేస్తూ వస్తున్నారు.
కాని ఈమద్య చిరంజీవి చాలా స్పీడ్ పెంచాడు.భారీ ఎత్తున సినిమా లు చేసే ఉద్దేశ్యంతో ప్రస్తుతం చిరు నాలుగు సినిమా లు కమిట్ అయ్యి ఉన్నాడు.రికార్డు బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకున్న సినిమా లు చాలానే ఉన్న చిరంజీవి ఖాతాలో ఈ నాలుగు సినిమా ల్లో మళ్లీ రికార్డులు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. గాడ్ ఫాదర్ సినిమా లూసీఫర్ కు భోళా శంకర్ సినిమా వేదాళంకు రీమేక్ అనే విషయం తెల్సిందే.