మెగాస్టార్ తో పోటీపడీ మరీ నటించిన సత్యదేవ్.. ప్రశంసలు షురూ!

టాలీవుడ్ లో ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ కూడా ఉంది.నిన్న అక్టోబర్ 5న దసరా పండుగ సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది.

 Godfather Actor Satyadev gets Special Applaus For His Role, Actor Satyadev, Meg-TeluguStop.com

సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు, కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు.ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో నటించింది.

అలాగే సత్యదేవ్ కూడా ఈ సినిమాలో కీలక రోల్ లో నటించాడు.తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.

ఆచార్య తర్వాత మెగాస్టార్ సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూసారు.ఎట్టకేలకు నిన్న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ ను అయితే మెప్పించింది.

ఇక ఈ సినిమాలో చిరుతో పాటు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటించాడు.పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయినా ఈ సినిమాలో అందరు ఇప్పుడు నటుడు సత్యదేవ్ గురించి మాట్లాడు కుంటున్నారు.

ఎందుకంటే ఈయన మెగాస్టార్ కు అపోజిట్ గా నటించాడు.తన రోల్ తో ఆడియెన్స్ ను ఆశ్చర్య పరిచాడు.

మెగాస్టార్ అంతటి నటుడి ఎదురుగా విలన్ గా నటించాలి అంటే మాములు విషయం కాదు.అది కూడా ఆయనకు ధీటుగా ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే చాలా గట్స్ ఉండాలి.మరి సత్యదేవ్ అలాంటి నటనతోనే మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు.దీంతో ఇప్పుడు ఈయన నటన గురించి అంతా మాట్లాడు కుంటున్నారు.అతడి నటనను ప్రశంసిస్తున్నారు.ఇలా గాడ్ ఫాదర్ సినిమాకు సత్యదేవ్ కూడా ఒక పిల్లర్ గా నిలిచాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరి ముందు ముందు మరిన్ని మంచి రోల్స్ అందుకుంటాడో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube