మలైకా అరోరా కోసం గోడెక్కిన ఫొటోగ్రాఫర్.. బాయ్ ఫ్రెండ్ ఏం అన్నాడంటే?

సినీ నటీనటులు ఏది చేసినా అది వార్త గా మారుతుంది.అంతేకాకుండా వాళ్లు ఎక్కడ కనిపించినా మన ఫోటోగ్రాఫర్ లు క్లిక్ మనిపిస్తారు.

 Godekkina Photographer For Malaika Arora What Did Her Boyfriend Say, Malaika Aro-TeluguStop.com

ఇక వాళ్లు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్లని ప్రశాంతంగా ఉండనివ్వకుండా వాళ్ళకి అడ్డుగా వచ్చి మరి ఫోటోలు తీస్తుంటారు.ఎక్కువగా ఎయిర్ పోర్ట్ లలో ఇతర ఫ్యామిలీ ఫంక్షన్ సమయాలలో నటీనటులు కనిపించడమే ఆలస్యం ఇక వాళ్ళ ఫోటోలు తెగ వైరల్ గా మారుతాయి.

ప్రస్తుతం మలైకా అరోరా కోసం ఓ ఫోటోగ్రాఫర్ గోడెక్కి మరీ ఫోటో తీయగా ఆ తర్వాత ఆమె బాయ్ ఫ్రెండ్ ఏమన్నాడంటే.

తాజాగా బాలీవుడ్ జంట మలైకా అరోరా, అర్జున్ కపూర్ కలిసి కరీనా కపూర్ ఇంటికి వెళుతున్న సమయంలో ఓ ఫోటో గ్రాఫర్ వాళ్లకు ఎదురుగా ఓ హంగామా చేశాడు.

ఇటీవలే కరీనాకపూర్ తను రెండో బిడ్డకు జన్మనివ్వగా ఆమెను చూడటానికి బాలీవుడ్ సెలబ్రెటీలంతా తమ ఇంటికి వరుసగా వెళ్తున్నారు.తాజాగా అర్జున్, మలైకా లు కూడా బంద్రా లో ఉన్న కరీనా ఇంటి దగ్గరకు వెళ్లారు.

ఇక వాళ్లు కారు దిగి ఇంట్లోకి వెళ్తున్న సమయంలో ఫోటో గ్రాఫర్ లు వాళ్లను ఫోటో తీయడానికి దూసుకువచ్చాడు.

కానీ అంతలోనే మరో ఫోటోగ్రాఫర్ అందరి కంటే భిన్నంగా ఫోటో తీయాలనుకున్నాడేమో గాని ఏకంగా కరీనాకపూర్ ఇంటి గోడ పైకి ఎక్కి ఫోటోలు దింపుతున్నాడు.

దీంతో అర్జున్ కపూర్ అతడిని చూసి కోపానికి గురి అయ్యాడు.ఇక మీరు మారరా అంటూ, కనీసం కొంచెమైనా సభ్యత పాటించండి అంటూ, గోడ దిగమని మర్యాదగా తెలుపుతున్నానని చెప్పాడు.

కానీ ఆ ఫోటో గ్రాఫర్ అదే పనిలో ఫోటో దింపుతుంటే అయినా పట్టించుకోరేమంటూ, ఇది తప్పు పద్ధతి కాదని దయచేసి కిందకు దిగండి.ఇలాంటి గోడలు ఎక్కకూడదని ఫోటోగ్రాఫర్ పై మండి పడ్డాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube