చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తల నరికిన దుర్గమ్మ.. ఎలానో తెలుసా..?!  

Maa Durga slays China\'s Xi Jinping in Berhampore, Durga Matha, Berhampore ,Chinese President Xi Jinping ,Coronavirus, navaratrulu,Xi Jinping Head - Telugu Bengal. Matha, Berhampore, Chinese President Xi Jinping, Coronavirus, Durga Matha, Maa Durga Slays China\\'s Xi Jinping In Berhampore, Navaratrulu, Xi Jinping Head

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎన్ని ఇబ్బందులు పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.2019 డిసెంబర్ నెలలో ప్రపంచం నలుమూలల ఈ మధ్యన సంబంధించిన కొత్త కేసులు నమోదయ్యాయి.ఆనాటి నుంచి నేటి వరకు కేసులు ప్రతిరోజు ఎన్నో కొన్ని కొత్తగా వస్తూనే ఉన్నాయి.అయితే ఇందుకు ప్రధాన కారణం చైనా.చైనా లో జరిగే బయో పరిశోధనలో భాగంగా ఈ కరోనా వైరస్ వచ్చిందని తెలిపారు.మరికొందరు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

TeluguStop.com - Goddess Durga Chinas Xi Jinping In Berhampore

అయితే ఇక అసలు విషయంలోకి వెళ్తే.

కరోనా విషయంలో ప్రపంచ దేశాలు మొత్తం చైనా వైఖరిని నిలదీస్తూనే ఉన్నాయి.

TeluguStop.com - చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తల నరికిన దుర్గమ్మ.. ఎలానో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగానే తాజాగా భారతదేశంలోని బెంగాల్ ప్రజలు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ విగ్రహం తలను నరికి వేశారు.భారతదేశంలో జింగ్ విగ్రహం ఏంటి.? ఆయన తలను నరకడం ఏంటి అని అనుకుంటున్నారా.? ప్రతి సంవత్సరంలాగే బెంగాల్ రాష్ట్రంలో దసరా పండుగ సందర్భంగా నిర్వహించే దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుతారు.మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వినాయకుని పండగ ఎలా జరుపుతారో.అలాగే బెంగాల్ వాసులు అమ్మవారి నవరాత్రులు ఎంతో ఘనంగా జరుపుతారు.ఇందులో భాగంగానే బెంగాలీలు ఈ మధ్య కాలంలో కాస్త వైవిద్యాన్ని జోడిస్తున్నారు.

ఇందులో భాగంగానే బెంగాల్ రాష్ట్రంలోని బేరం పూర్ లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద అమ్మవారి చేతిలో హతమైన రాక్షసుడు స్థానంలో ఈసారి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ బొమ్మను ఉంచారు.

దీనికి కారణం ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో ఉసురు తీయడానికి గల కారణం ఆయన అన్నట్లుగా దానిని ఉంచారు.ఈ క్రమంలోనే అమ్మవారి పాదాల కింద జిన్ పింగ్ బొమ్మను ఉంచారు.

అంతేకాకుండా ఆయన తల, మొండెం వేరు చేసినట్లుగా విగ్రహాన్ని రూపొందించారు.ఇదివరకు భారత్ – చైనా దేశాల సరిహద్దుల వద్ద 20 మందికి పైగా భారత జవాన్లను హతమార్చిన సంఘటనకు కూడా ఈ రకంగా భారతీయులు నిరసనలు తెలియజేస్తున్నారు.

దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

#Bengal. Matha #Berhampore #MaaDurga #Durga Matha #Navaratrulu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Goddess Durga Chinas Xi Jinping In Berhampore Related Telugu News,Photos/Pics,Images..