దేవుడా: భార్య ప్రేమతో పెట్టిన లంచ్ బాక్స్ ను భర్త ఏం చేస్తున్నాడంటే..?!

భార్యలు తమ కోసం ప్రేమగా వంటలు వండిపెడితే చాలు తమ జీవితం ధన్యం అనుకుంటారు భర్తలు.ఎంతో పుణ్యం చేస్తే కానీ ప్రేమగా వండిపెట్టే భార్యలు దొరకరు.

 God What Is The Husband Doing With The Lunch Box That The Wife Put With Love-TeluguStop.com

మంచిగా వండి పట్టే భార్యలు దొరక్కపోతే బయట నాసిరకమైన వంటలు తినాల్సిన పరిస్థితి వస్తుంది.కానీ ఒక భర్త తన కోసం ఎంతో ప్రేమగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి భార్య ఇస్తున్న కూడా.

అతడు ఆమె చేసిన ఫుడ్ తినకుండా దాన్ని ఆఫీస్ లో సహోద్యోగులు అమ్మేస్తున్నాడు.ఈ విషయం తెలియని ఆ అమాయక భార్య తాను ప్రేమగా చేసిపెడుతున్న వంటలను తన భర్త తింటున్నారని ఎంతో సంతోష పడుతూ ఉండేది.

 God What Is The Husband Doing With The Lunch Box That The Wife Put With Love-దేవుడా: భార్య ప్రేమతో పెట్టిన లంచ్ బాక్స్ ను భర్త ఏం చేస్తున్నాడంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రతిరోజు భర్త ఆఫీస్ నుంచి ఖాళీ బాక్స్ తో వస్తుంటే ఆమె తన భర్తను బాగా మెచ్చుకునేది.

ఈ 37 ఏళ్ల భర్తకు ఫాస్ట్ ఫుడ్స్ తినడమంటే చాలా ఇష్టం.

అందుకే ఆఫీస్ యొక్క లంచ్ బ్రేక్ లో రోజు 20 డాలర్ల చొప్పున ఫాస్ట్ ఫుడ్ కోసం ఖర్చుపెట్టేవాడు.దీనితో భార్య కి చాలా విసుగ్గా ఉండేది.

అన్ హెల్తీ ఫుడ్ తినడమే కాదు ఆ ఫుడ్ కోసం అనవసరంగా వందల డాలర్లు ఖర్చుపెట్టడం ఎందుకు అని భర్తను నిలదిసేది.ఓ రోజు తానే మంచిగా ఫుడ్ రెడీ చేస్తానని చెప్పి శాండ్‌విచ్‌లు ప్యాక్ చేసి ఇచ్చింది.

ఐతే భర్త ఆ లంచ్ బాక్స్ ని ఖాళీ గా ఇంటికి తీసుకురావడంతో ఆమె సంతోషపడింది.ఖాళీగా బాక్స్ తీసుకురావడమే కాదు తనకు మరిన్ని శాండ్‌విచ్‌లు ప్యాక్ చేయమని భర్త అడగడంతో ఆమె చాలా మురిసిపోయి మరుసటి రోజు నుంచి ఎక్కువ ఫుడ్ ప్యాక్ చేయడం ప్రారంభించింది.

తన భర్త తాను చేసే హెల్తీ ఫుడ్ కి అలవాటు పడ్డాడని ఆమె ఆనంద పడింది.

ఐతే ఒకరోజు భర్త తన సహోద్యోగి ని డిన్నర్ కి ఆహ్వానించాడు.

దీనితో భార్య మంచి ఫుడ్ తయారు చేసింది.అయితే భోజనం చేస్తున్న సమయంలో ఆ సహోద్యోగి మాట్లాడుతూ మీరు చేసే శాండ్‌విచ్‌లు చాలా బాగుంటాయ్ కాస్త రేటు ఎక్కువే గానీ చాలా బాగుంటాయి అని పొరపాటున నోరు జారాడు.

దీంతో భార్యకు విషయమంతా అర్థం అయింది.తన భర్త తాను ప్రేమగా ప్రిపేర్ చేసే శాండ్‌విచ్‌లు అమ్మేసి వచ్చిన డబ్బులతో తనకిష్టమైన ఫాస్ట్ ఫుడ్ కొనుగోలు చేసుకొని తింటున్నాడని ఆమె ఎట్టకేలకు తెలుసుకొని తన భర్తపై ఫైర్ అయ్యింది.

నేనేమన్నా పిచ్చిదానిలా మీకు కనిపిస్తున్నానా? భార్యనని కూడా చూడకుండా నన్ను అగౌరవపరుస్తావా? నన్ను ఇంతలా మోసం చేస్తావా అని కడిగిపారేసింది.ఐతే ఇదే విషయాన్ని ఆమె రెడిట్ ఫారమ్ లో షేర్ చేసి తన భర్తకు ఇక జీవితంలో వంట చేసి పెట్టనని చెబుతోంది.

అయితే ఈ పోస్టు ప్రస్తుత సంతోషం మాధ్యమాల్లో తెగ అవుతుంది.

#Husband #Wife #Selling #Lunch #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు