దేవుడా.. అక్కడ ఐస్ ‌క్రీమ్ ల‌లో కరోనా వైరస్..! చివరకు..?!  

corona virus, ice cream, covid 19, china ice cream, contaminated, 4,800 ice creams,china,municipality,935 ice cream boxes,200 ice cream boxes,home isolation - Telugu 4, 800 Ice Creams, China Ice Cream, Contaminated, Corona Virus, Covid-19, Ice Cream

కరోనా వైరస్ పుట్టినిల్లయిన చైనాలో మరోసారి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.డ్రాగన్ దేశంలో తాజాగా ఐస్ క్రీమ్ కంపెనీకి సంబంధించి రకరకాల ఐస్ క్రీమ్ లలో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు.

TeluguStop.com - God There Is A Corona Virus In Ice Cream

ఐస్ క్రీమ్ శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపగా అందులో కరోనా వైరస్ పాజిటివ్ ఫలితాలు వచ్చాయని అధికారులు వెల్లడించారు.ఇందులో దాదాపు 4850 ఐస్క్రీమ్ బాక్సులలో కరోనా వైరస్ ఉందని నిర్ధారించడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఐస్ క్రీమ్ లను ఎవరు తిన్నారు.? ఎంతమంది తిన్నారు.? అన్న వాటిపై ఇప్పుడు అధికారులు ఫోకస్ పెట్టారు.వీటిని తిన్నవారులో ఇప్పటివరకు ఎంతమంది వైరస్ సోకింది అన్న విషయంపై అధికారులు లెక్కలు వేస్తున్నారు.

TeluguStop.com - దేవుడా.. అక్కడ ఐస్ ‌క్రీమ్ ల‌లో కరోనా వైరస్.. చివరకు..-General-Telugu-Telugu Tollywood Photo Image

చైనా దేశంలోని ఈశాన్య ప్రాంతం అయిన ఓ మున్సిపాలిటీ ప్రాంతంలో స్థానికంగా ఓ కంపెనీలో తయారు చేసిన ఐస్ క్రీమ్ కంటెంట్ ను అధికారులు ల్యాబ్ కు పంపించారు.అయితే ఇందులో కరోనా వైరస్ కలిసినట్టుగా వారు నిర్ధారించడంతో ఈ విషయం వైరల్ గా మారింది.ప్రస్తుతం కంపెనీ స్టోరేజ్ లో ఉంచిన 2000 ఐస్ క్రీమ్ బాక్సులను పైగా అధికారులు సీజ్ చేశారు.మిగతా వాటిని ఐస్క్రీమ్ ఫ్రాంఛైజీలకు పంపిణీ చేయగా అవి ఎక్కడ ఉన్నాయి? ఏ మార్కెట్ కు తరలించారని వివరాలను సేకరించి వాటిని పంపిణీకి ఆపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటివరకు 935 ఐస్క్రీమ్ బాక్స్ లు స్థానిక మార్కెట్ లోకి వెళ్ళాయని, అందులో కేవలం 65 ఐస్క్రీమ్ బాక్స్ లు మాత్రమే విక్రయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.ఇందుకు సంబంధించి ఇప్పటికే 1662 మంది కంపెనీ ఉద్యోగులను హోం ఐసోలేషన్ కి పంపించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు.

వారిలో ఎంతమందికి కరోనా వైరస్ సోకిందో ఇంకా నిర్ధారణ చేయలేదు అంటూ అధికారులు తెలుపుతున్నారు.కరోనా వైరస్ ఇంత మొత్తాన్ని వ్యాపించడానికి గల కారణం సదరు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ లో సరైన పారిశుద్ధ్య పనులు చేయకపోవడం, శానిటేషన్ చేయకపోవడం లాంటి వాటి వల్ల వైరస్ సోకిందని అధికారులు తెలిపారు.

.

#Corona Virus #800 Ice Creams #COVID-19 #China Ice Cream #Contaminated

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు