దేవుడా: పాఠశాలలో తుపాకీతో కాల్పులు జరిపిన విద్యార్థిని..! చివరకు..?!

సాధారణంగా ఆరో తరగతి విద్యార్థి అంటే చదువుకోవడమో లేదా ఆడుకోవడమో చేయాలి.అయితే ఇక్కడొక విద్యార్థి మాత్రం గన్ తో ఆట్లాడుకుంది.

 God The Student Who Opened Fire With A Gun At The School Finally-TeluguStop.com

ఆరో త‌ర‌గ‌తి విద్యార్థిని తాను చ‌దువుతోన్న‌ పాఠ‌శాల‌లో తుపాకీతో కాల్పులు జ‌రిపి అల‌జ‌డి రేపింది.అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఇదాహో రాష్ట్రంలోని ఓ పాఠశాలలో రిగ్బి మిడిల్ స్కూల్‌లో ఓ బాలిక ఆరో తరగతి చదువుతోంది.ప్రతి రోజూ ఆ బాలిక బడికి వ‌చ్చే స‌మ‌యంలోనే ఓ తుపాకీని త‌న వెంట తెచ్చుకుంటుంది.

 God The Student Who Opened Fire With A Gun At The School Finally-దేవుడా: పాఠశాలలో తుపాకితో కాల్పులు జరిపిన విద్యార్థిని.. చివరకు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా గన్ తెచ్చుకుంటున్న ఆ బాలిక నేడు పాఠ‌శాల‌లో విచక్షణ రహితంగా కాల్పులకు తెగ‌బ‌డింది.దీంతో పాఠశాల మొత్తం భయబ్రాంతులకు గురైంది.

బాలిక కాల్పులు జరపడంతో తన తోటి ఉన్న ఇద్దరు విద్యార్థులు, స్కూల్ సిబ్బందిలో ఒకరికి గాయాల‌య్యాయి.కాల్పుల్లో గాయాలపాలైన విద్యార్థులను, స్కూల్ సిబ్బందిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

వెంటనే వారికి పాఠశాల సిబ్బంది చికిత్స అందేలా చేయ‌డంతో గాయాలపాలైనవారు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.గాయాలైనవారిని హుటాహుటిన పాఠశాల సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించడం వల్ల వారు ఇప్పుడు క్షేమంగా ఉన్నారు.

ముగ్గురికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న‌ పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

కాల్పులు జ‌రిపిన బాలిక‌ను అదుపులోకి తీసుకున్నారు.అమెరికాలో తుపాకీ సంస్కృతి కార‌ణంగా త‌రుచూ కాల్పుల ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి.

ఇప్పుడు పాఠ‌శాల‌లో చ‌దివే బాలిక‌ కూడా తుపాకీతో కాల్పులు జ‌ర‌ప‌డం క‌ల‌క‌లం రేపుతోంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాల్పులు జరిపిన బాలికను విచారిస్తున్నారు.తన మానసిక పరిస్థితిపై వైద్యులను సంప్రదించారు.

ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.పాఠశాలకు విద్యార్థులు గన్ లను తీసుకుని రాకుండా ఉండేలా చూడాలని పాఠశాల సిబ్బందికి తగు సూచనలు చేశారు.

#Child #Police #School #Firing

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు