దేవుడా: ఆ దేశంలో ఒంటరితనానికి ఓ శాఖను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఎందుకంటే..?!

ప్రపంచ దేశాలలో పారిశ్రామంగా, అలాగే టెక్నాలజీ పరంగా అభివృద్ధిలో బుల్లెట్ ట్రైన్ కంటే ముందుగా దూసుకుపోతున్న దేశాలలో జపాన్ ఒకటి.రెండో ప్రపంచ యుద్ధంలో ఆ దేశంలో పడిన రెండు అణుబాంబులను తట్టుకుని నిలబడి ప్రగతి వైపు దూసుకు వెళ్తున్న ఆ దేశంలో ప్రతి రోజు ఏదో ఒక చోట భూకంపాలు రావడం, అలాగే సునామీలు రావడం ఆ దేశానికి నిద్రలేకుండా చేస్తున్నాయి.

 Japan Government Has Set A Branch For Loneliness With An Minister,  Loneliness,-TeluguStop.com

ఒకవైపు ప్రకృతి ఆ దేశం వైపు కాస్త కన్నెర్ర చేసిన కానీ.ఆ దేశ ప్రజలు మాత్రం ప్రగతి వైపు దూసుకెళ్తున్నారు.

అయితే ఆ దేశంలోని ప్రజలు చాలామంది జీవించడానికి ధైర్యంగా ముందుకు వెళ్తున్న అదే సమయంలో ఆ దేశంలో సూసైడ్ చేసుకునేవారు కూడా లేకపోలేదు.ఈ మధ్య కాలంలో జపాన్ దేశంలో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.

అంతేకాదు ఆ దేశంలో ఫ్యూజి అరే పర్వతం దగ్గర ఓ అడవి ఉంది.ఎవరైనా చనిపోవాలి అనుకుంటే ఆ పర్వతం దెగ్గరికి వెళ్లి సూసైడ్ చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది.

ఇక అసలు విషయంలోకి వెళితే.తాజాగా జపాన్ ప్రధానమంత్రి యోషి హిడే తన క్యాబినెట్ లో ఏకంగా ఒంటరితనం సంబంధించిన శాఖను ఏర్పాటు చేసి దానికి ఓ మంత్రిని కూడా నియమించారు.

అయితే ఇలా చేయడం కొత్తేమీ కాదు.ఇదివరకే 2018లో ఇంగ్లాండ్ ప్రభుత్వం ఇలాంటి శాఖను ఏర్పాటు చేసింది కూడా.

Telugu Branch, Feburary, Japan, Loneliness, Suicides, Latest-Latest News - Telug

ప్రస్తుతం జపాన్ దేశంలో సూసైడ్ శాతం రోజురోజుకూ పెరిగిపోవడంతో చాలామంది ఒంటరితనం భరించలేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.ఇందుకు తోడుగా ఆ దేశంలో శిశువు జననం రోజురోజుకి తగ్గిపోతుడడంతో ప్రభుత్వం ఆ విషయాన్ని కూడా పరిశీలిస్తోంది.జపాన్ దేశంలో మహిళలే ఎక్కువగా సూసైడ్ లు చేసుకుంటున్నట్లు ప్రభుత్వ అధికారులు నివేదిక వెల్లడించారు.ఇందులో భాగంగానే ఆత్మహత్యలను ఆపాలన్న టార్గెట్ తో జపాన్ ప్రభుత్వం ఇలా డిప్రెషన్ లోకి వెళ్లి ఆ తర్వాత చనిపోవాలని వారికోసం వారిలో ధైర్యాన్ని నింపేందుకు ఈ కొత్త శాఖను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

ఇకపోతే ఒంటరితనానికి ఓ శాఖ అవసరమా అని మనకు అనిపించవచ్చు.కాకపోతే, జపాన్ లాంటి దేశాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది కాబట్టి ఆ శాఖను ఆదేశాలలో ఏర్పాటు చేశారు.

ఎవరికైనా చనిపోవాలన్న కోరిక కలిగితే ఒంటరితనాన్ని ఆపే కార్యాలయం దగ్గరికి ఓ సారి రావాలని ప్రభుత్వం ప్రజల్ని కోరుతోంది.ఇలా ఆ ఆఫీస్ దగ్గరికి వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం చెబుతారు.

చూడాలి మరి ఇలా ఏర్పాటుచేసిన ఆ దేశంలో పరిస్థితి మారుతుందో లేదో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube