దేవుడా: తీరిక లేకపోవడంతో ఆ కంపెనీ ఉద్యోగులు బాటిళ్ళలోనే మూత్రం..!

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉంటారు.కనీసం వారికీ తినడానికి సమయం లేకుండా ఉండే వారు ఎందరో.

 God: The Employees Of That Company Urinate In Bottles Due To Lack Of Leisure, Pe-TeluguStop.com

ఈ బిజీ లైఫ్ లో కొంతమంది వారి అలవాట్లలో మార్పులు చేసుకోవడం, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపకుండా ఉండే క్షణాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో ఆ కంపెనీ కి చెందిన ఉద్యోగులకి మాత్రం క్షణం కూడా తీరిక లేకపోతున్నారట.

ఆఫీసులో పని కాస్త ఎక్కువగా ఉండడంతో, కనీసం ఆ ఉద్యోగులు బాత్రూం వెళ్లడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.ఇంతకీ ఆ ఉద్యోగులు ఎవరని అనుకుంటున్నారా.

పూర్తి వివరాలు ఇలా అమెరికాలోని అఅమెజాన్ వర్క్ షాప్స్‌ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులట.వారికి కనీసం మూత్రం పోయడానికి కూడా బాత్ రూమ్ కి  వెళ్ళే సమయం కూడా లేదని సమాచారం.

బాత్ రూమ్ కి వెళ్లి మూత్రం పోసే సమయం లేక చివరికి వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్ లో పోసేస్తున్నారని విస్కాన్సిన్ కు చెందిన సెనెటర్ మార్క్ పోకన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఈ సమాచారాన్ని చూసిన అమెజాన్ సంస్థ వారు తీవ్రంగా ఖండించారు.

అలాగే ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు పలు మీడియా సంస్థలు కూడా పేర్కొనడంతో చివరికి అమెజాన్ సోషల్ మీడియా వేదికగా ఉద్యోగులకు  క్షమాపణలు చెబుతూ రిట్వీట్ చేసింది.ప్రస్తుతం ఇందుకు సంబందించిన కధనం సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube