అమెరికా భర్తకి దేవుడు చెప్పాడు....నీ పెళ్ళాం పిల్లల్ని చంపేయ్..!!!  

God Says To America Husband To Kill Children Of His Wife-arizona,children,devotee,god,husband,kill,telugu Nri Updates,wife

అమెరికాలో ఓ దారుణం వెలుగు చూసింది. ఓ వ్యక్తికి దేవుడంటే వల్లమాలిన అభిమానం, ప్రేమా, గౌరవం, భక్తి కుప్పలు తెప్పలుగా ఉన్నాయట. దాంతో దేవుడు కలలో ఏది చెప్పినా చేయడం మొదలు పెట్టాడు ఆ పరమ భక్తుడు..

అమెరికా భర్తకి దేవుడు చెప్పాడు....నీ పెళ్ళాం పిల్లల్ని చంపేయ్..!!!-God Says To America Husband To Kill Children Of His Wife

దాంతో ఓ రోజు కలలో తన దేవుడు చెప్పాడని తన భార్యా పిల్లల్ని చంపేసి కటకటాల పాలయ్యాడు పూర్తి వివరాలలోకి వెళ్తే.

అమెరికాలోని అరిజోనాకు చెందిన ఆస్టిన్ స్మిత్ అనే వ్యక్తి భార్య, ముగ్గురు పిల్లలతో హాయిగా జీవిస్తున్నాడు.

అతడికి దేవుడిపై నమ్మకం ఎక్కువ నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు. దీనికి తోడుగా చాదస్తం అనే క్వాలిటీ కూడా ఉంది. దాంతో ఒక రోజు ఆయనకు దేవుడు కలలో కనిపించి.

నీ పెళ్ళాం మంచిది కాదు పరాయి వ్యక్తితో అక్రమ సంభంధం పెట్టుకుంది ఆమెని చంపేయ్ అని ఆజ్ఞాపించాడట.

అంతే దేవుడు చెప్పడంతో ఆ పరమ భక్తుడు మరుసటి రోజు ఉదయం తీవ్ర ఉద్వేగానికిలోనై తన భార్యని ఎందుకలా చేశావ్ అని గట్టిగా ఏడుస్తూ షూట్ చేసి చంపేశాడు. అంతటితో ఆగకుండా పిల్లల్ని కూడా పొట్టన పెట్టుకున్నాడు. ప్రియుడి గురించి వెతుకుతూ రోడ్ల వెంబడ తిరుగుతూ కనిపించాడు పోలీసులకి అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని వివరాలు సేకరించి అరెస్ట్ చేసి కేసు విచారణ చేపట్టారు.