దేవుడా.. కోట్లు ఖరీదు చేసే కారును ఇట్టే తగలబెట్టేశాడు..!  

car, fire, social media, viral, youtube, 2.4 crores, netizens, comments - Telugu 2.4 Crores, Car, Comments, Fire, Netizens, Social Media, Viral, Youtube

ఎవరైనా వాహనాల్ని ఎంతో ముచ్చటపడి కష్టపడిన సొమ్మును కొంత కొంత పోగు చేసుకొని కారును కొనుగోలు చేస్తారు.అయితే కొత్తగా కొన్న వాహనంలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే వాహనం కొన్న వద్దకు తీసుకువెళ్లి వాటిని సర్దుకుంటాయి.

TeluguStop.com - God Put A Car That Costs Crores Of Rupees And Set It On Fire

అయినా కానీ ఏదైనా సమస్య ఉంటే పై స్థాయి వ్యక్తులకు ఫిర్యాదు చేసి అందుకు సంబంధించిన పరిష్కారాన్ని వెతుకుతారు.అయితే తాజాగా ఓ వ్యక్తి మాత్రం తన కారులో ఏర్పడిన సమస్యకు పై అధికారులు పరిష్కారం చూపలేకపోవడం కార్ డీలర్ పై ఉన్న కోపంతో ఏకంగా 2 కోట్లకు పైగా విలువ చేసే కార్ ను పెట్రోల్ పోసి తగల పెట్టేశాడు ఓ ఘనుడు.

ఇకపోతే ఈ ఘటనకు కి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

TeluguStop.com - దేవుడా.. కోట్లు ఖరీదు చేసే కారును ఇట్టే తగలబెట్టేశాడు..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

రష్యా దేశానికి చెందిన మైకెల్ లిట్వీన్ ప్రాంక్ వీడియోలు చేస్తూ ఆ వీడియోలని యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తూ ఉండడం అతని పని.ఇకపోతే ఇటీవల మార్కెట్లోకి వచ్చిన మెరిసిడ్జ్ కొత్త కార్లను లిట్వీన్ కొనుగోలు చేశాడు ఇక ఆ కారు ధర మన కరెన్సీలో 2.4 కోట్ల రూపాయలు.అయితే లిట్వీన్ ఇలా చేయడానికి గల కారణం లేకపోలేదు.

తాను కొన్న తర్వాత నుండి కారు తరచు బ్రేక్ డౌన్ అవుతూ ఇబ్బంది పెట్టేదట.ఇకపోతే ఇందుకు సంబంధించి తాను ఐదు సార్లు మెరిసిడ్జ్ డీలర్ వద్దకు వెళ్లిన సమస్యకు పరిష్కారం లభించలేదు.

మరమత్తు చేయడానికి ఇచ్చిన ప్రతి సారి కారు రెండు రోజులు షో రూమ్ లోనే ఉంచుకుని ఎలాంటి మరమ్మత్తులు చేయకుండా కార్ ని తిరిగి చేస్తున్నట్లు ఆయన ఆరోపిస్తున్నారు.

ఇలా చేయడంతో అతనికి తీవ్రమైన కోపం రావడంతో సదరు డీలర్ కు, మెర్సిడెస్-బెంజ్ సంస్థకు బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకొని అందులో భాగంగా ఏకంగా 2.4 కోట్ల విలువైన తన కార్ ను అతనే స్వయంగా దగ్ధం చేశాడు.ఇందుకుగాను అతను ఓ సువిశాల ప్రాంతానికి ఆ కార్ ను తీసుకువెళ్లి దాని పై పెట్రోల్ పోసి తను కొద్ది దూరం నుండి నిప్పు అంటించాడు.

ఇక అంతే నిమిషాలలో ఆ కారు అగ్నికి ఆహుతి అయింది.ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఒక యూట్యూబ్ లోనే ఏకంగా కోటి మందికి పైగా ఈ వీడియోని చూశారంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం.అయితే ఈ వీడియో కి సంబంధించి నెటిజన్స్ నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది.

కావాలనే ఇంత ఖరీదైన కార్ ను ఎవరు కాల్చారని కేవలం పబ్లిసిటీ స్టంట్ కావచ్చని కొందరు కామెంట్ చేస్తున్నారు.మరికొందరు ఈ వీడియో చాలా ఖరీదైనది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

#Fire #Netizens #Social Media #Viral #Youtube

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

God Put A Car That Costs Crores Of Rupees And Set It On Fire Related Telugu News,Photos/Pics,Images..