దేవుడా.. ముఖ్యమంత్రి విమానంలోనే ప్రి వెడ్డింగ్ షూట్..!  

God Pre wedding shoot on chattisgarh CM plane, pre wedding shoot, helicopter, viral news, chief minister, chattisgadh, cm, bhupen bhagel, plane, - Telugu Bhupen Bhagel, Chattisgadh, Chief Minister, Cm, Helicopter, Plane, Pre Wedding Shoot, Viral News

పెళ్లి అనేది జీవితంలో జరిగే ఒక మర్చిపోలేని మధుర జ్ఞాపకం అనే చెప్పాలి.ఎవరో తెలియని ఇద్దరు వ్యక్తులు పెళ్లి అనే దాపంత్య బంధంతో ఒక్కటి అయ్యే శుభకార్యం అని చెప్పాలి.

TeluguStop.com - God Pre Wedding Shoot On Cm Plane

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని పెద్దలు అంటూ ఉంటారు అలాగే ఇక్కడ ఈ కాలంలో జరుపుకునే పెళ్లిళ్లు కూడా ఆ స్వర్గాన్ని తలపించే అంతా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు.పెళ్లిలో జరిగే మధురానుభూతులను పదిలంగా దాచుకునేందుకు ఆ జ్ఞాపకాల్ని, ఆ క్షణాలను ఫొటోలు, వీడియోల రూపంలో తీయించుకుంటారు.

అయితే పెళ్లి కుదిరిన తర్వాత కూడా, పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌ కు చాలామంది యువత ఆసక్తి చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్స్‌ ను ఏదో కొత్తగా చేయాలన్న తాపత్రయంతో లేని పోని తలనొప్పులు తెచ్చుకుంటున్నారు.

TeluguStop.com - దేవుడా.. ముఖ్యమంత్రి విమానంలోనే ప్రి వెడ్డింగ్ షూట్..-General-Telugu-Telugu Tollywood Photo Image

కొన్ని నెలల క్రితం ఇలానే ఒక జంట ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ కోసం నదిలోకి పడిపోయి ప్రాణాలు సైతం కోల్పోయారు.ఇప్పుడు మళ్ళీ అలాంటి సంఘటన ఒకటి ఆందోళన కలిగిస్తుంది.

ఈ జంట ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా సీఎం వినియోగించే విమానంలోనే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ తీసుకున్నారు.వివరాలలోకి వెళితే.ఛత్తీస్‌గర్ ‌లోని రాయ్‌పూర్ లో ఓ జంట ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ అని ఏకంగా సీఎం భూపేష్ బఘేల్ వినియోగించే విమానంలో కూర్చుని ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ తీయించుకున్నారు.ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం రేగింది.

జష్పూర్‌కు చెందిన కాబోయే వధూవరులిద్దరూ కొన్ని రోజుల క్రితం రాయ్‌పూర్‌కు చేరుకున్నారు.సీఎం వినియోగించే చాపర్ ‘ఏడబ్ల్యూ 109 పవర్ ఎలైట్‘ నడిపే వ్యక్తి కాబోయే వరుడికి స్నేహితుడు అవ్వడంతో అతని సహాయంతో ఈ ఫొటోషూట్‌ తీయించుకున్నారు.అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అతనిని అధికారులు సస్పెండ్ చేశారు.జనవరి 20న ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ జరిగినట్లు తెలిసింది.ఆ వధువు కుటుంబం రాష్ట్ర బీజేపీ చీఫ్‌కు బంధువులని సమాచారం.

#Bhupen Bhagel #Plane #Helicopter #Chief Minister #Chattisgadh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు