దేవుడా: కేవలం 11 నిమిషాల ట్రిప్‌ కోసం రూ. 205కోట్లు..?!

దేశీయ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రజలకు అనేక సేవల్ని అందిస్తోంది.ఈ వ్యాపార సంస్థ లాక్ డౌన్ లో అన్నీ వస్తువులను ఇంటికి తెచ్చి ఇచ్చే ఏర్పాట్లు చేసింది.

 God Just 11 Minutes For A Trip Of Rs 205 Crores-TeluguStop.com

అందుకే చాలా మంది అమెజాన్ కస్టమర్ అయిపోతున్నారు.ప్రస్తుతం అమెజాన్ అధినేత ఈనెల 20వ తేదీన రాకెట్ లో అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు.

తన సొంత సంస్థ తయారు చేసిన బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ రాకెట్ లో ఆయన ప్రయాణం చేయనున్నారు.ఆయనతో పాటుగా ఆ యాత్రకు తన సోదరుకు మార్క్ బెజోస్ కూడా ప్రయాణం చేయనున్నాడు.బ్లూ ఆరిజిన్ సంస్థ బెజోస్ తో కలిసి వేలంపాట నిర్వహించింది.11 నిమిషాల పాటు స్పేస్ లోకి వెళ్లి రావడానికి తాము ప్రయాణించే ఆ రాకెట్ సీటును వేలం వేశారు.మేనెలలో ఇందుకోసం బిడ్ లను నిర్వహించారు.ఆ సందర్భంగా 159 దేశాల నుంచి 7 వేల మందికిపైగా స్పేస్ లోకి వెళ్లడానికి ఆసక్తి చూపారు.తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

 God Just 11 Minutes For A Trip Of Rs 205 Crores-దేవుడా: కేవలం 11 నిమిషాల ట్రిప్‌ కోసం రూ. 205కోట్లు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu 11 Mints Trip, 205 Crores, Amazon Ceo, Flight Travel, Viral Latest-Latest News - Telugu

దీంతో శనివారం నాడు ఆ సీటుకు సంబంధించి వేలం పాటను నిర్వహించారు.ఈ నేపథ్యంలో 28 మిలియన్ డాలర్లు అంటే భారత దేశ పరంగా చూస్తే సుమారుగా 205 కోట్ల రూపాయలకు ఆ రాకెట్ సీటును వేలంపాట ద్వారా గెలుచుకున్నాడు.ఈ వేలం పాట ముందుగా 4.8 మిలియన్ డాలర్ల నుంచి స్టార్ట్ అయ్యింది.ఆ తర్వాత ఏకంగా అది 28 మిలియన్ డాలర్లు పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అయితే వేలం పాట ద్వారా రాకెట్ సీటును దక్కించుకున్న ఆ వ్యక్తం పేరును మాత్రం గోప్యంగా ఉంచారు.ఈనెల 20వ తేదీన బెజోస్, అతని సోదరుడితో పాటుగా వేలం పాట ద్వారా సీటు గెలుచుకున్న వ్యక్తి కూడా ప్రయాణం చేయనున్నాడు.

జూలై 5వ తేదీని బెజోస్ అమెజాన్ సీఈవోగా బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

#11 Mints Trip #Amazon CEO #Flight Travel #205 Crores

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు