గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లు అన్ని రూ.కోట్లా.. చిరంజీవిదే పైచేయి కానీ?

దసరా పండుగ కానుకగా మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఆ మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది.మాస్ ప్రేక్షకులకు గాడ్ ఫాదర్, క్లాస్ ప్రేక్షకులకు ది ఘోస్ట్, ఫ్యామిలీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు స్వాతిముత్యం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

 God Father The Ghost First Day Collections Details Here Goes Viral  , God Father-TeluguStop.com

గాడ్ ఫాదర్ సినిమా పరిమిత సంఖ్యలో థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.ఈ సినిమాకు ఏకంగా 16.26 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.ఈ సినిమా కలెక్షన్లను ఏరియాల వారీగా పరిశీలిస్తే నైజాంలో ఈ సినిమాకు 3 కోట్ల 29 లక్షల రూపాయల కలెక్షన్లు రాగా సీడెడ్ లో ఈ సినిమాకు 3 కోట్ల 18 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.

ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు కోటీ 26 లక్షల రూపాయల కలెక్షన్లు రాగా గోదావరి జిల్లాల్లో 2 కోట్ల 19 లక్షల రూపాయలు, ఆంధ్రలోని ఇతర జిల్లాలలో 3 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.

సల్మాన్ ఖాన్ నటించినా హిందీలో ఈ సినిమాకు కేవలం 45 లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి.

ఓవర్సీస్ లో ఈ సినిమాకు 2 కోట్ల 10 లక్షల రూపాయల కలెక్షన్లు రాగా కర్ణాటకలో 74 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.ది ఘోస్ట్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే 21 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా కలెక్షన్లు ఆశించిన రేంజ్ లో లేకపోవడం గమనార్హం.

తొలిరోజు ది ఘోస్ట్ సినిమా కలెక్షన్లు కేవలం 2.45 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.గాడ్ ఫాదర్ నైజాం ఏరియాలో సాధించిన రేంజ్ లో కూడా ది ఘోస్ట్ సినిమా తొలిరోజు కలెక్షన్లు లేకపోవడం గమనార్హం.గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube