చిరంజీవి పరువు తీసిన గాడ్ ఫాదర్ రేటింగ్.. ఆ సినిమాల కంటే తక్కువంటూ?

ఒకప్పుడు వరుసగా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా తెరకెక్కిన సినిమాలలో నటించిన చిరంజీవి ఇప్పుడు మాత్రం రొటీన్ కు భిన్నంగా భిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నారు.పలు సినిమాలలో చిరంజీవి సీరియస్ రోల్స్ లో నటిస్తుండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన రిజల్ట్ ను సొంతం చేసుకోవడం లేదు.చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలలో నటించడంపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

 God Father Movie Rating Minus Point For Chiranjeevi Details Here Goes Viral In-TeluguStop.com

2022 సంవత్సరం దసరా కానుకగా విడుదలైన సినిమాలలో అంతోఇంతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాగా గాడ్ ఫాదర్ కు పేరుంది.నిర్మాతలు ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేయగా ఫుల్ రన్ లో ఈ సినిమా 60 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను కూడా సొంతం చేసుకోలేదు.లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఒరిజినల్ తో పోల్చి చూస్తే ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిస్థాయిలో ఫెయిలైంది.

Telugu Bhola Shankar, Bimbisara, Chiranjeevi, God, Lucifer, Tollywood-Movie

తాజాగా ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం కాగా ఈ సినిమా రేటింగ్ ను చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఒకింత షాకవుతున్నాయి.జెమిని ఛానల్ లో ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రసారం కాగా ఈ సినిమాకు కేవలం 7.7 రేటింగ్ వచ్చింది.కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ రేటింగ్ తో పోల్చి చూస్తే గాడ్ ఫాదర్ రేటింగ్ తక్కువ కావడం గమనార్హం.

బుల్లితెరపై గాడ్ ఫాదర్ మూవీ యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

Telugu Bhola Shankar, Bimbisara, Chiranjeevi, God, Lucifer, Tollywood-Movie

అఖండ, బంగార్రాజు సినిమాలకు కూడా గాడ్ ఫాదర్ తో పోల్చి చూస్తే బెటర్ రేటింగ్స్ వచ్చాయి.చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ను ఆశిస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా తెరకెక్కే సినిమాలకు ప్రాధాన్యత ఇస్తారేమో చూడాల్సి ఉంది.

చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తుండగా చిరంజీవి క్రేజ్ కు అనుగుణంగా ఈ కథలో మార్పులు చేస్తున్నారని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube