దేవుడా: చివరకి సులభ్ కాంప్లెక్స్ ని కూడా ఇలా ఉపయోగించవచ్చా..?!

సాధారణంగా మనకు చికెన్, మటన్ కావాలి అంటే దుకాణాలకు వెళ్లి తెచ్చుకుంటాం.అయితే ఓ ప్రాంతంలో గుడ్ల, మటన్ కావాలి అంటే కోసం సులభ్ కాంప్లెక్స్ వెళ్తారంటా.

 Sulab Comples, Selling , Mutton, Eggs, Indore, Madhya Pradesh,viral,social Media-TeluguStop.com

అయితే ఇలాంటి ప్రదేశంలో ఆలా ఎలా తెచ్చుకుంటారు అని అందరు అనుకుంటారు కదా.?! ఇక ఆ ప్రాంతం వాళ్ళు అక్కడి నుండే గుడ్ల, మటన్ తెచ్చుకుంటారంట.అయితే ఆ ప్రాంతం ఎక్కడ అని అనుకుంటున్నారా.? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి నిర్వాకం వల్ల ఈ వింత విచిత్ర సంఘటన జరిగింది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగర పరిథిలో సులభ్ కాంప్లెక్స్ లో బాధ్యతలు నిర్వహించాలని ఓ వ్యక్తికి చెప్పారు.ఇక ఆ వ్యక్తి అందరిని ఆశ్చర్య పరిచే విధంగా ఉండేలా ఈ వింత నిర్వాకానికి పాల్పడ్డాడు.ఇక ఓ వైపు సులభ్ కాంప్లెక్స్ ను నిర్వహిస్తూనే, దాని ముందే మటన్, గుడ్ల అమ్మకం మొదలు పెట్టాడు.

ఇతడి నిర్వాకాన్ని కొందరు మున్సిపాల్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.దీంతో ఇండోర్ మున్సిపాల్టీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఇతడు అడ్డంగా దొరికిపోయాడు.

ఇక అధికారులు అతడికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు.అదే సమయంలో సులభ్ కాంప్లెక్స్ లను నిర్వహించే ఎన్జీవో సులభ్ ఇంటర్నేషనల్ సంస్థకు 20వేల రూపాయల జరిమానాను విధించారు.

అయితే ఓ వ్యక్తి నిర్వాకం వల్ల అటు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడటంతోపాటు, ఇటు సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకులు కూడా అప్రతిష్టకు గురైయ్యిందని స్థానికులు అంటున్నారు.ఇక సులభ్ కాంప్లెక్స్ లో మటన్, గుడ్ల వ్యాపారం జోరుగా నడుస్తోందన్న వార్తలపై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇప్పుడు.

ఇక ఈ వీడియో చుసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇక అతడు పెట్టగానే, కొనేవాళ్లకు ఏమయిందంటూ ఎద్దేవా చేస్తున్నారు.ఈ నిర్వాకానికి పాల్పడిన వ్యక్తిని జరిమానాతో కాకుండా అరెస్ట్ చేసి జైలుకు పంపాలనీ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యక్తికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube