దేవుడా.. షేవింగ్ చేయడానికి బంగారం రేజర్ ఉపయోగిస్తున్న బార్బర్.. ఎక్కడంటే..?!

ప్రజలలో కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చి  ఎన్నో కష్టాలు, నష్టాలు తీసుకొని వచ్చిన సంగతి అందరికి విదితమే.కరోనా మహమ్మారి కష్టాల నుంచి బయటపడేందుకు ఎన్నో వ్యాపార సంస్థలు పలు ఆఫర్స్ ను ప్రవేశపెట్టడంతో పాటు, విన్నూత్న ఆలోచనలు చేస్తూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

 God Barber Using Gold Razor To Shave Where-TeluguStop.com

ఈ తరుణంలో తాజాగా ఒక సెలూన్ యజమాని కస్టమర్ల కోసం ఒక గోల్డెన్ ఐడియా వేశాడు.తన కస్టమర్ల కోసం కట్టింగ్ చేసే  రేజర్ ను బంగారంతో తయారు చేయించాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే పూణే లోని అవినాష్ అనే ఒక సెలూన్ యజమాని తన కస్టమర్ల కోసం తాను కటింగ్ చేసే రేజర్ చాలా డిఫరెంట్ గా ఉండాలని ఆ రేజర్ ను ఏకంగా బంగారం తోనే తయారు చేయించాడు.తమ కస్టమర్లను ఆకట్టుకోవడానికి కోసం ఏకంగా 80 గ్రాముల బంగారంతో రేజర్ ను తయారు చేయించుకున్నట్లు అవినాష్ చెబు తున్నాడు.

 God Barber Using Gold Razor To Shave Where-దేవుడా.. షేవింగ్ చేయడానికి బంగారం రేజర్ ఉపయోగిస్తున్న బార్బర్.. ఎక్కడంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా బంగారం రేజర్ తయారు చేయడానికి దాదాపు 4 లక్షల రూపాయల ఖర్చు అయ్యిందని, అలాగే సెలూన్ షాపులు కూడా రీ మోడలింగ్ చేయించినట్లు పేర్కొన్నాడు.రీ మోడలింగ్ చేయించిన సెలూన్ పున ప్రారంభం కూడా స్థానిక బిజెపి ఎమ్మెల్యే గోపీచంద్ తో చేయించాడు.

బంగారం  రేజర్ కు కూడా కాస్త పబ్లిసిటీ అవ్వాల్సిందే కదా అని షాప్ కు వచ్చిన కస్టమర్లకు గోల్డెన్ రేజర్ తో కటింగ్, షేవింగ్ చేస్తామంటూ ప్రచారం ముమ్మరం చేశాడు అవినాష్.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఇలా ప్రచారం చేయడంతో తమ సెలూన్ కు కస్టమర్ల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతోందని సంతోషం వ్యక్త పరిచాడు.

బంగారం రేజర్ తో గడ్డం చేయించుకున్న కస్టమర్ల దగ్గర నుంచి కేవలం వంద రూపాయలు మాత్రమే తీసుకుంటున్నట్లు అవినాష్ పేర్కొన్నాడు.

#Pune #Viral #Salon Owner #Golden Razor #Opening

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు