దేవుడా: కోమాలోనే ప్రసవించిన మహిళ.. మూణ్ణెళ్ళ తర్వాత కూతురిని చూసుకున్న తల్లి..!

కెల్సీ టౌన్సెండ్ అనే ఓ అమెరికా మహిళ కరోనా వైరస్ బారినపడి బాగా క్షీణించారు.దీంతో ఆమెను కుటుంబ సభ్యులు మ్యాడిసన్ నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రి కి తరలించారు.

 Wisconsin, Mother, ,baby, Carona Virus, Covid 19,coma , Deliverd,america,madenas-TeluguStop.com

అయితే అప్పటికే ఆమె ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో.వైద్యులు ఆమెకు ఊపిరితిత్తుల ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలనుకున్నారు.

అప్పటికే ఆమె శరీరము నీలం రంగులోకి మారింది.ఐతే ఆలస్యం చేస్తే ఆమె కడుపులో ఉన్న బిడ్డ మెదడుకు ఆక్సిజన్ అందటం కష్టమవుతుందని.

బిడ్డ చనిపోయే ప్రమాదం ఉందని భావించిన వైద్యులు ఆమెకు వెంటనే సిసేరియన్ ద్వారా ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు.

Telugu Baby, Carona, Coma, Covid, Deliverd, Mother, Wisconsin-Latest News - Telu

ఆ తర్వాత ఊపిరితిత్తుల ఆపరేషన్ చేయాలనుకుంటున్న సమయం లో ఆమె కోమాలోకి వెళ్లిపోయారు.అయితే బిడ్డను కూడా చూడకుండా కెల్సీ 75 రోజుల పాటు కోమాలోనే ఉన్నారు.జనవరి 27న ఆమె కోమా లో నుంచి బయటకు వచ్చారు.

అప్పుడే తన మూడు నెలల పాప ని మొట్టమొదటిసారిగా ఆమె తన కనులారా ఆమె చూడగలిగారు.అయితే భార్య కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు భర్త చాలా బాధ పడ్డారు.

నెలల పాటు పడిన తన బాధను ఒక రోలర్ కోస్టర్ గా ఆయన అభివర్ణించారు.భార్య ఆస్పత్రిలో ఉంటే నలుగురు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ తల్లి తండ్రి తానై బాధ్యతంతా తన నెత్తిమీద పెట్టుకున్నారు.

ఐతే ఊపిరితిత్తుల ఆపరేషన్ చేయకుండానే కెల్సీ టౌన్సెండ్ చాలా త్వరగా కోలుకున్నారు.దీంతో వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.కోమా, కొవిడ్ -19 నుంచి కోలుకున్న తర్వాత కెల్సీ మాట్లాడుతూ తన కుటుంబమే తనకు సర్వస్వం అని.ప్రతిక్షణం తన కుటుంబంతోనే గడుపుతానని చెప్పుకొచ్చారు.ఏది ఏమైనా కెల్సీ టౌన్సెండ్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడటం నిజంగా ఆ కుటుంబం యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube