మనసు మార్చుకున్న దొంగలు.. ఎందుకంటే?

ఏంటో అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు చూస్తుంటే దొంగల్లో కూడా మంచి దొంగలు ఉంటారేమో అని పిస్తూ ఉంటుంది.తాజా సంఘటన చూస్తుంటే అలాగే అనిపిస్తోంది మరి, జూన్ 22వ తేదీన అమెరికాలోని ఓ డైరీ ఫాం లో దొంగలు పడ్డారు.

 The Thieves Who Changed Their Mind Left The Goats, Goats, Left The Goats, Thieve-TeluguStop.com

కొన్ని చిన్న చిన్న మేక పిల్లలను ఎత్తుకెళ్లారు.అయితే ఆ డైరీ ఫామ్ నిర్వహిస్తున్న నిర్వాహకులు.

మేక పిల్లలు దొంగతనానికి గురికావడంతో భావోద్వేగంగా ఒక లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తమ డైరీ నుంచి ఆరు మేక పిల్లలను దొంగలు ఎత్తుకెళ్లారని.

అప్పటి నుంచి తాము సరైన తిండి నిద్ర లేక పిచ్చివాళ్లము అయిపోయామని… దయచేసి మేకపిల్లలను తిరిగి ఇచ్చేయండి అంటూ వేడుకుంటూ ఒక లేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.నెటిజన్ల మనసును కదిలించిన ఈ లేఖ… అటు దొంగలు కంటపడి వారి మనసును కూడా మార్చేసింది.

ఇంకేముంది మంచి వాళ్ళు గా మారిపోయిన దొంగలు మేక పిల్లలను ఎక్కడినుంచి పట్టుకొచ్చారో అక్కడే వదిలేశారు.ఇక ఆ తర్వాత రోజు మేక పిల్లలను చూసిన నిర్వాహకులు ఎంతో సంతోషంతో మేకపిల్లలు వచ్చేసాయి అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ మరో పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube