భారీగా పెరిగిన మేకపాల డిమాండ్.. లీటర్ పాలు ఏకంగా..?!

గేదెపాలు లేదా ఆవుపాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని మన అందరికి తెలిసిందే.అలాగే మనం కూడా ఎక్కవగా ఆవు లేదంటే గేదె పాలు మాత్రమే తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము.

 Goat Milk Too Costly And Demand One Litre Cost , Goat Milk, Demand, Bhupal, Li-TeluguStop.com

ఆవు గేదె పాలు కాకుండా మేక పాలు గురించి కూడా మీరు వినే ఉంటారు.కానీ ఈ మేక పాలను మనం ఎక్కువగా ఉపయోగించము.

కొందరు మాత్రమే మేకపాలను తాగుతూ ఉంటారు.ఇదిలా ఉంటే ఆవు పాలు కానీ, గేదె పాలుకానీ మహా అయితే ఎంత ఉంటాయి చెప్పండి లీటర్ 80 రూపాయిలు, లేదంటే 100 రూపాయిలు ఉంటాయి.

కానీ ఆవు, గేదె పాల కంటే ఇప్పుడు మేక పాలకే ఎక్కువ డిమాండ్ ఉందంటే నమ్మండి.అంతా ఇంతా డిమాండ్ కాదండోయ్ ఏకంగా లీటర్ మేకపాలు 1500 రూపాయిల కన్నా ఎక్కువకే అమ్ముడుపోతున్నాయి.

ఏంటి లీటర్ మేకపాలు 50 రూపాయలు అలా ఉండేవి అలాంటిది 1500 రూపాయిల అని షాక్ అవుతున్నార కానీ ఇది మీరు నమ్మలేని నిజం.ఇంతకీ అసలు మేక పాలకి అంత డిమాండ్ ఎందుకు అనే వివరాలు తెలుసుకుందామా.

మేక పాలకు అంత డిమాండ్ రావడానికి గల కారణం ఏంటంటే డెంగ్యూ ఫీవర్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ డెంగ్యూ ఫీవర్ ఫియర్ తో ఒక్కసారిగా లీటరు మేక పాలు రూ.50 నుంచి ఏకంగా రూ.1500 లు దాక పెరిగిపోయాయి.అసలు డెంగ్యూ ఫీవర్ కి మేక పాల ధర పెరగడానికి మధ్య సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా.అసలు విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ లో రోజు రోజుకి డెంగ్యూ కేసులు పెరిగిపోతున్న విషయం మన అందరికి తెలిసిన విషయమే.

డెంగ్యూ ఫీవర్ వస్తే రక్తంలో ప్లేట్ లెట్స్ స్థాయిలు పడిపోతాయి.ఇలా ప్లేట్ లెట్స్ పడిపోవడంతో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.ఈ నేపథ్యంలోనే మేకపాలు తాగితే రక్తంలో ప్లేట్‌లెట్ల స్థాయి పెరుగుతుందని విస్తృతంగా ప్రచారం జరగడంతో మేక పాలకు విపరీతమైన డిమాండ్ వచ్చేసింది.అందుకే అక్కడి ప్రజలు మేకపాలు కోసం ఎగబడి పోతున్నారు.లీటరు రూ.50లు పెట్టి కొనుక్కునే వాళ్ళు రూ.1500 పెట్టి కొనుక్కోవడానికి కూడా వెనకాడడం లేదు.

Telugu Bhupal, Demand, Dengue, Goat Milk, Latest, Liter, Litre Cost, Uttar Prade

ఈ మేక పాల డిమాండ్ గురించి యూపీలోని సదర్ బాదర్ సమీపంలో ఓ పాల వ్యాపారి ఇలా చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో డెంగ్యూ వ్యాప్తి అధికంగా ఉండడంతో ప్రజలు మేక పాలు కోసం మా దగ్గరకి వచ్చి లైన్ లో నిలబడి మరి అడుగుతున్నారు.పాలు దొరకవు అని చెప్పిన ఎలా గోలా ఒక అరలీటరు అయినా ఇవ్వండి అని ప్రాధేయ పడుతున్నారు అంటూ తెలిపాడు.అయితే అక్కడ స్థానికంగా ఉండే ఆయుర్వేద డాక్టర్లు మేకపాలతో కాఫీ,టీలు పెట్టుకుని తాగితే ప్లేట్‌లెట్లు పెరుగుతాయని చెప్పడంతో అక్కడ ప్రజలు మేకపాల వైవు మొగ్గు చూపుతున్నారు.

మేక పాలలో కాల్షియం, ప్రోటీన్స్, కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నా మాట నిజమే కానీ డెంగ్యూ జ్వరానికి మేక పాలు తాగితే ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతాయని అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని డాక్టర్లు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube