మేక 'పాలు' అంటే 'ఛీ' అంటున్నారా ..? ఇది చదివితే వాటి గొప్పతనం తెలుస్తుంది   Goat Milk Contains Very Great Medicinal Properties     2018-10-24   23:11:26  IST  Sai M

మేకపాలు తాగుతారా అని ఎవరినైనా అడిగితే ఛీ మేక పాలా ..? అంటూ చాలా ఛీఫ్ గా ముఖం పెడతారు. సమాజంలో చాలామందికి వాటి గొప్పతనం గురించి తెలియక అలా ఛీఫ్ గా చూస్తారు కానీ మేక పాలు లో ఉండే గొప్పతనం గురించి తెలిస్తే ఇంకెప్పుడూ అలా అనరు.

మేకపాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. ప్రోటీన్లు, క్యాల్షియం ఎక్కువగా ఉండే మేకపాలు శరీర ఆరోగ్యానికి చక్కని సహాయకారి అంటున్నారు. మేకపాలలో ట్రైటోఫాన్‌ అనే ఎమినో యాసిడ్స్‌ పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ సక్రమంగా అందుతాయి. కప్పు మేకపాలు తీసుకోవడం వల్ల 35 శాతం ఫ్యాటీ ఆమ్లాలను శరీరం అధికంగా పొందుతుంది. ఎముకల పటిష్టతకు, కీళ్ల నొప్పుల నివారణకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మేకపాలలో ఉండే బయో ఆర్గానిక్‌ సోడియం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. జీవకణాల వృద్ధికీ మేకపాలు తాగడం మంచిది. డెంగ్యూ సోకినవారి రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంది. వారికి మేకపాలు ఇస్తే ప్లేట్‌లెట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.

Goat Milk Contains Very Great Medicinal Properties-

గాంధీ మేకపాలను ఎక్కువగా తాగడానికీ ఓ కారణం ఉందట. చిన్నప్పుడు ఆయన అతిసార వ్యాధితో బాధపడుతూ.. ఆఖరికి ప్రాణాపాయ స్థితికి వెళ్లినప్పుడు.. వైద్యుల సలహా మేరకు మేకపాలు తాగి, తిరిగి మామూలు మనిషి అయ్యారని చెబుతుంటారు. కొన్ని దేశాల పాల ఉత్పత్తి కేంద్రాల్లో మేకపాలకు మంచి డిమాండ్‌ ఉంది. మేక పాల నుండి వెన్న, మీగడ, ఐస్‌ క్రీమ్‌ మొదలైన వాటినీ తయారుచేస్తుంటారు. మేకపాలల్లో ఖర్జూరపండ్లను నానబెట్టుకొని తింటే చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. రక్తహీనతతో బాధపడేవారికి మేకపాలు ఔషధంలా పనిచేస్తాయి. అయితే పసిపిల్లలకు మేకపాలు పట్టేటప్పుడు తప్పకుండా డాక్టరు సలహా తీసుకోవాలి. ఆవుపాలతో పోల్చుకుంటే మేకపాలు తొందరగా జీర్ణమవుతాయి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.