మేయర్ గా మేక ఎంపిక అవ్వడం ఏమిటి అనుకుంటున్నారా.?? అవునండి బాబు ఇది నిజమే మేయర్ గా మేక ఎన్నికయింది.అమెరికాలోని వెర్మాంట్‌లో ఉన్న ఫెయిర్ హావెన్ అనే చిన్న సిటీ లో నిర్వహించిన ఎన్నికల్లో లింకన్ అనే మేక మేయర్ గా ఎన్నికయింది.అంతేకాదు మరొక విషయం ఏమిటంటే.
ఈ ఎన్నికల్లో పోటీగా కుక్కలు , పిల్లులు , సహా సుమారు 15 జంతువులూ నిలబడ్డాయి.సుమారు మొత్తం 53 ఓట్లు పడగా , 15 ఓట్లు సాధించి లింకన్ విజయం సాధించి మేయర్ గా ఎన్నికయింది.
ఏంటి ఇప్పటికే ఆశ్చర్యం వీడటం లేదా ఇదంతా వాస్తవమే.ఒక సారి ఆ ఎన్నికల వివరాలలోకి వెళ్తే.
ఫెయిర్ హావెన్ పట్టాన జనాభా 2,500.ఈ పట్టణానికి అధికారికంగా మేయర్ లేరు.అయితే ఆ భాద్యతలని టౌన్ న్ మేనేజర్ జోసెఫ్ గంటర్ నివహిస్తున్నారు.అయితే పట్టణంలో క్రీడా మైదానానికి నిధులు సేకరణ చేపట్టడానికి ఈ ఎన్నికలు ఏర్పాటు చేశామని, మిషిగాన్‌లోని ఒమెనా గ్రామానికి ఓ పిల్లి ఉన్నతాధికారిగా ఉన్నట్లు ఒక పత్రికలో చూసి అలాంటి ప్రయత్నమే ఇక్కడ నిర్వహించామని ఆయన తెలిపారు.