గోవాలో షూటింగ్.. వారికి మొత్తం కావాలట!

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమా వాళ్లు తమ సినిమాల్లో అందమైన బీచ్ సీన్ల కోసం ఎంచుకునే మొదటి ప్లేస్ గోవా.అక్కడ ఉండే బీచ్‌లు, బికినీల అందాలను కెమెరాలతో పట్టి తమ చిత్రాలలో వాడుతుంటారు.

 Goa State Impose New Rules On Film Shooting-TeluguStop.com

అయితే ఇప్పటివరకు గోవాలో సినిమా షూటింగ్ అంటే ఎవరు పడితే వారు చేసేవారు.కానీ ఇకపై అలా కుదరదని అంటోంది అక్కడి ప్రభుత్వం.

గోవాలో షూటింగ్ జరుపుకునే చిత్రాలు, ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాలు గోవాను చాలా చెడ్డగా చూపిస్తున్నారని గోవా ప్రభుత్వం భావించింది.గోవాను కేవలం డ్రగ్స్, శృంగార ప్రదేశంగా మాత్రమే చిత్ర దర్శకనిర్మాతలు చూపిస్తున్నారని గోవా సీఎం మండిపడుతున్నారట.

ఇటీవల ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీ కలిసి నటించిన మలంగ్ అనే చిత్రంలో గోవా పేరును చెడగొట్టే ప్రయత్నం జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఇకపై గోవాలో సినిమా షూటింగ్ చేయాలంటే, ఆ చిత్ర యూనిట్ తమ స్ర్కిప్టును ప్రభుత్వానికి తెలపాలని అధికారులు అంటున్నారు.

తమ కథలో గోవాను ఎక్కడా తక్కువ చేసి చూపించనట్లు అయితేనే సినిమా షూటింగ్‌కు అనుమతి ఇస్తామని గోవా అధికారులు అంటోన్నారు.అంటే, ఇకపై గోవాలో షూటింగ్ చేసుకోవాలంటే వారికి మొత్తం స్ర్కిప్టు చెప్పాల్సిందేనన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube