వైరల్‌ : 9 ఏళ్ల బాలుడి ఏడుపుతో కదిలిన నెటిజన్స్‌ లక్షల్లో విరాళం  

Gofundme To Send Bullied Boy To Disneyland Raises Viral Video - Telugu 9 Years Boy Video Wiral In Social Media, 9years Australian Kid, Disneyland, , Hollywood Star Huge Jakman, Kwidan, Some Wiral In Social Media

సోషల్‌ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి.ఆ వీడియోలు వైరల్‌ అవ్వడం వల్ల కొందరికి మంచి జరిగితే కొందరికి చెడు జరుగుతుంది.

Gofundme To Send Bullied Boy To Disneyland Raises Viral Video

తెలియక చేసిన వీడియోలు ముఖ్యంగా నష్టం చేస్తాయి.వైరల్‌ అయిన వీడియోల వల్ల లాభం పొందిన వారు కూడా ఉన్నారు.

అయితే ఇక్కడ ఒక 9 ఏళ్ల బాలుడు పొందిన లాభం ఎవరు పొంది ఉండరు.ఆ బాలుడికి ఏకంగా లక్షల్లో విరాళాలు వచ్చాయి ఇంకా వస్తూనే ఉన్నాయి.

ఆ విరాళాలు కోట్లకు చేరుతాయేమో అంటూ నెటిజన్స్‌ అంటున్నారు.

ఇంతకు అసలు విషయం ఏంటీ అంటే క్వీడన్‌ అనే 9 ఏళ్ల ఆస్ట్రేలియన్‌ కుర్రాడు తన తల్లిని టూర్‌కు వెళ్లేందుకు డబ్బులు కావాలంటూ కోరుతూ ఉంటాడు.అయితే ఆ తల్లి మాత్రం తన వద్ద డబ్బులు లేవని చెబుతుంది.దాంతో ఆ కుర్రాడు తనకు ఒక కత్తి ఇస్తే దాంతో తనను తాను చంపేసుకుంటాను అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.

ఆ వీడియోను ఆ కుర్రాడి తల్లి వీడియో తీసింది.సరదాగా పెట్టిందో లేదంటే మరేంటో కాని ఫేస్‌ బుక్‌ లో ఆ వీడియో పెట్టడంతో అది కాస్త వైరల్‌ అయ్యింది.

అది ఎంతగా అంటే హాలీవుడ్‌ స్టార్‌కు చేరేంతగా.

హాలీవుడ్‌ స్టార్‌ హ్యుజ్‌ జాక్మన్‌ అతడికి మద్దతుగా నిలిచాడు.తాను డొనేషన్‌ ఇవ్వడంతో పాటు ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమం మొదలు పెట్టాడు.సోషల్‌ మీడియా ద్వారా అతడు ఆ 9 ఏళ్ల కుర్రాడి కోసం పిలుపునివ్వడంతో ఎంతో మంది ముందుకు కదిలారు.

వందలాది మంది తమకు తోచిన విధంగా సాయం చేశారు.రెండు మూడు డాలర్ల నుండి వంద డాలర్ల వరకు ఎవరికి తోచింది వారు ఇచ్చారు.అలా ఆ అబ్బాయి టూర్‌కు వెళ్లడం ఏంటీ నెల నెల రెండు టూర్లు వెళ్లేంత డబ్బు జమ అయ్యింది.ఆ బాలుడి తల్లి ఇప్పుడు అతడిని టూర్‌కు పంపడంతో పాటు మంచి స్కూల్‌లో జాయిన్‌ చేసి బాగా చదివిస్తానంటోంది.

తాజా వార్తలు

Gofundme To Send Bullied Boy To Disneyland Raises Viral Video-9years Australian Kid,disneyland,hollywood Star Huge Jakman,kwidan,some Wiral In Social Media Related....