Gmail: ఇకనుండి ఆఫ్‌లైన్‌లో కూడా జీమెయిల్‌ సేవలు లభించనున్నాయి.. ఎలా అంటే?

ఈరోజుల్లో ఇమెయిల్ ప్రాముఖ్యత గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఇక్కడ స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరు ఓ జిమెయిల్ అకౌంట్ ని కలిగి వుంటారు.

 Gmail From Now On Gmail Services Will Also Be Available Offline-TeluguStop.com

ఎందుకంటే జిమెయిల్ రిజిస్ట్రేషన్ లేనిదే మొబైల్ ఆన్ కాదు.అలాగే అనేమంది ఉద్యోగ వీధిలో నిర్వహణగా ఇమెయిల్ ని వాడుతుంటారు.

అలాగే జిమెయిల్ లేని స్టూడెంట్స్ ఉండనే ఉండరని చెప్పుకోవాలి.ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 95% మంది ఈ జిమెయిల్ అకౌంట్ ని కలిగి వున్నవారు కావడం విశేషం.

అందుకే యూజర్లకు కొత్తగా గూగుల్ ఓ సంచలనాత్మక మార్పుకి శ్రీకారం చుట్టబోతోంది.

ఎవరన్నా ఆఫీసులో కాకుండా బయట తిరుగుతున్నప్పుడు, తన మొబైల్లో లో డేటా లేనపుడు సడెన్గా తమ ఇమెయిల్ చెక్ చేయాల్సిన అవసరం వున్నపుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి సందర్భాల్లో ఇంటర్నెట్‌ అవసరం లేకుండా మెయిల్‌ యాక్సెస్‌ చేసుకునే వెసులుబాటు ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది.ఇలాంటి కష్టాలకు చెక్ పెడుతూ గూగుల్ సంస్థ జీమెయిల్‌ యూజర్లు ఆఫ్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీనిద్వారా ఇంటర్నెట్‌ అవసరంలేకుండా ఆఫ్‌లైన్‌లో జీమెయిల్‌ ద్వారా మెయిల్ చదవడం, రిప్లై ఇవ్వడంతోపాటు జీమెయిల్‌ మెసేజ్‌లను కూడా చూసే వెసులుబాటు కలదు.

Telugu Gmail, Googleoffers, Offline, Ups-Latest News - Telugu

జీమెయిల్‌ సేవలు ఆఫ్‌లైన్‌లో ఉపయోగించుకునేందుకు ఇంటర్నెట్‌ కనెక్షన్ అందుబాటులో ఉన్నప్పుడే mail.google.comను క్రోమ్‌ బ్రౌజర్‌లో బుక్‌ మార్క్‌ చేసుకోవాలి.తర్వాత జీమెయిల్ ఓపెన్ చేసి అందులో సెట్టింగ్స్‌లోకి వెళితే ‘See All Settings’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.అందులో ‘Offline’ ట్యాబ్‌పై క్లిక్ చేస్తే, ‘Enable Offline Mail’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల క్రితం ఈ-మెయిల్స్‌ ఆఫ్‌లైన్‌లో స్టోర్ చేయాలని అడుగుతుంది.

వారం, నెల, 90 రోజుల ఆప్షన్స్‌ ఉంటాయి.వాటిలో మీకు కావాల్సిన ఆప్షన్‌ సెలెక్ట్ చేసుకుని సేవ్‌ ఛేంజస్‌పై క్లిక్ చేసి జీమెయిల్ ఆఫ్‌లైన్‌ సేవలను ఉపయోగించుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube