ఆ ఆఫర్ ను మరింత పొడిగించిన జిమెయిల్..!

కరోనా కారణంగా చాల కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రొమ్ హోమ్ ఇచ్చి ఇంటి దగ్గర నుండే పనులు చేపించుకుంటున్నారు.ఇక ఉద్యోగులతో మాట్లాడటానికి ఎక్కువగా జూమ్, గూగుల్ మీట్, ఇతర ప్లాట్‌ఫాంలు వీడియో మీటింగ్స్, ఆన్‌లైన్ క్లాసుల కోసం ప్రత్యేక ఫీచర్లను అభివృద్ధి చేశాయి.

 Gmail Extends The Offer Even Further  Google, Gmail,offer, Extended, Wfm , New O-TeluguStop.com

తాజాగా గూగుల్ మీట్ తమ వినియోగదారులకు శుభవార్త చెప్పింది.వీడియో కాల్స్‌, మీటింగ్స్‌ను 24 గంటల పాటు ఉచితంగా అందించే ఆఫర్‌ను పొడిగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.

అయితే గత ఏడాది గూగుల్ హ్యాంగ్ అవుట్‌ను గూగుల్ మీట్‌గా రీబ్రాండ్ చేసింది.కరోనాకు ముందు దీని ద్వారా 60 నిమిషాల వరకు అన్‌లిమిటెడ్ వీడియో కాల్స్ చేసుకునే వీలు కల్పించింది.ఆ తరువాత లాక్‌డౌన్‌లో ఇంటి నుంచి పనిచేసేవారి సంఖ్య పెరగడంతో ఈ పరిమితిని పెంచింది.24 గంటలూ వీడియో కాల్స్, మీటింగ్స్ నిర్వహించే అవకాశాన్ని కల్పించింది.100 మందిని మీటింగ్‌లో యాడ్ చేసే ఆప్షన్‌ను కూడా అభివృద్ధి చేసింది.ఇంతకు మించి సబ్‌స్క్రైబర్స్‌ను మీటింగ్స్‌కు యాడ్ చేయాలంటే గూగుల్ వర్క్‌ స్పేస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

Telugu Extended, Gmail, Google-Latest News - Telugu

అంతేకాదు ముందు గూగుల్ అకౌంట్ ఉన్న కస్టమర్లందరికీ గూగుల్ మీట్‌ సేవలను సెప్టెంబర్ 30 వరకు ఉచితంగా అందిస్తామని సంస్థ ప్రకటించింది.కానీ ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా రెండో దశలో కరోనా విజృంభణ మొదలైంది.దీంతో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్‌ అవకాశాన్ని పొడిగించాయి.అందువల్ల గూగుల్ మీట్ ఉచిత సేవలను 2021 మార్చి వరకు పొడిగించింది.తాజాగా మరోసారి జూన్ వరకు ఈ గడువును గూగుల్ పొడిగించిందని యాజమాన్యం తెలిపింది.

ఇక ఇటీవల గూగుల్ మీట్ సరికొత్త ఫీచర్‌ను ప్రకటించింది.

యాప్‌ ద్వారా మీటింగ్స్‌లో పాల్గొనే అందరినీ స్మార్ట్‌ ఫోన్‌లో టైల్ వ్యూలో చూసే అవకాశాన్ని కల్పించింది.ప్రస్తుతం iOS యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

మరికొన్ని రోజుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube