వణుకుతున్న వైజాగ్, కారణం…!  

Accidents that often occur in the pharmacy company at Visakhapatnam , Visakhapatnam , Pharma Company , Chemicals, Glochem Pahrma, Coronavirus, Paruvada Pharma City, Pharma Companies - Telugu Chemicals, Coronavirus, Glochem Pahrma, Paruvada Pharma City, Pharma Companies, Pharma Company, Visakhapatnam

ఒకపక్క కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రభలుతున్న ఈ సమయంలో కూల్ గా ఉండే విశాఖ నగరం వణికిపోతోంది.అయితే ఈ వణుకుకు కారణం కరోనా కాదు, అక్కడ మరో సమస్య తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

 Glochem Pahrma Coronavirus Paruvada Pharma City

ఇంతకీ ఆ సమస్య ఏంటంటే పరవాడ ఫార్మా సిటీ లో తరచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాలు.తాజాగా చోటుచేసుకున్న ప్రమాదం కారణంగా ఒకరు మృతి చెందగా,ముగ్గురు గాయపడినట్లు తెలుస్తుంది.2013 నుంచి చూసుకుంటే

పరవాడ ఫార్మా సిటీ

లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.ఈ క్రమంలో ఏడాది కి కనీసం నలుగురు ఐదుగురు మృతి చెందుతుండడం గమనార్హం.

పరవాడ లోని గోక్లేమ్ సంస్థలు ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తుంది.అక్కడ తరచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో కార్మికులు బలైపోవడం మామూలు అయిపొయింది.పరవాడ ఫార్మా సిటీ లో మొత్తం 85 కంపెనీలు ఉన్నాయి.ఇందులో కెమికల్స్ తో నడిచే కంపెనీ లే ఎక్కువ.2013 మార్చి 17 న అలివిరా ల్యాబ్స్ లో పేలుడు అదృష్ట వశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.ఆ తరువాత మే 30 న గోక్లేమ్ లో పేలుడు, ఈ ఘటనలో 4 గురు మృతి చెందగా,8 మంది గాయపడ్డారు.ఆ ప్రమాదం ఘటన మరువక ముందే జూన్, జులై నెలల్లో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.2013 నుంచి చూసుకుంటే ప్రతి రెండు నెలలకు ఒకసారి పార్మా సిటీ లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.కనీసం ఏడాదిలో నాలుగు నుంచి 5 గురు వరకు కార్మికులు మృతి చెందుతున్నారు.అయితే తాజాగా మరోసారి అదే ఫార్మాసిటీ లో మరో ప్రమాదం చోటుచేసుకోవడం ఈ ప్రమాదం లో ఒకరు బలవ్వడం తో అసలు అక్కడ పరిస్థితి ఏంటి అన్న అయోమయంలో జనాలు ఆందోళన చెందుతున్నారు.

వణుకుతున్న వైజాగ్, కారణం…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ తాజా ప్రమాదంలో మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండడం తో మిగితా ఫార్మా కంపెనీల కార్మికులు ఆ చుట్టూ పక్కల ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులుతీయాల్సి వచ్చింది.

అయితే దీనిపై ఇంకా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒకపక్క మహమ్మారి కి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉంటే ఇలా వరుస ప్రమాదాల కారణంగా ఆ పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్నారు.

#Chemicals #Coronavirus #Glochem Pahrma #Pharma Company #Visakhapatnam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Glochem Pahrma Coronavirus Paruvada Pharma City Related Telugu News,Photos/Pics,Images..