ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన ‘గూగుల్’.. ఆటాడేసుకున్న యూజర్లు..

ఈమధ్య కాలంలో ప్రముఖ సైట్ల సేవలు సడెన్ గా నిలిచిపోతున్నాయి.ఇటీవల ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎంకి కొన్ని గంటల పాటు అంతరాయం ఏర్పడింది.

 Globally Frozen 'google'the Users Are Playing , Google, Service, Technology Updates, Technology News, Stopped-TeluguStop.com

తాజాగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సేవలు ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిపోయాయి.సాంకేతిక సమస్యల కారణంగా గూగుల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది.

దీంతో వేలాది మందికి గూగుల్ సేవలు నిలిచిపోయాయి.మంగళవారం ఉదయం కొద్దిసేపు గూగుల్ వెబ్ సైబ్ ఓపెన్ కాలేదు.

 Globally Frozen 'Google'The Users Are Playing , Google, Service, Technology Updates, Technology News, Stopped -ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన ‘గూగుల్’.. ఆటాడేసుకున్న యూజర్లు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతోపాటు జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ కూడా పనిచేయలేదు.ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు అవుట్ టేజ్ ట్రాకింగ్ వెబ్ సైట్ డౌన్ డిటెక్టర్ వెల్లడించింది.

గూగుల్ లో ఏం సెర్చ్ చేసినా ఎర్రర్ చూపించింది.సర్వర్ లో 502 ఎర్రర్ డిస్ ప్లే అయ్యింది.తాత్కాలికంగా ఆగిపోవడంతోపాటు 30 సెకండ్ల తర్వాత మళ్లీ ప్రయత్నించండి అంటూ చూపించింది.దీంతో నిమిసాల వ్యవధిలో వేలాది మంది యూజర్లు గూగుల్ కి ఫిర్యాదు చేశారు.

గూగుల్ సేవలను తర్వగా పునరుద్ధరించాలంటూ గగ్గోలు పెట్టారు.గూగుల్ ని మీమ్స్ తో ఓ ఆటాడేసుకున్నారు.

దేశవ్యాప్తంగా గూగుల్ ట్రెండ్స్ కూడా పనిచేయలేదు.గూగుల్ ట్రెండ్స్ ఓపెన్ చేస్తే ఓ బ్లాంక్ పేజీ కనిపించింది.దీంతో యూజర్లు గూగుల్ పనిచేయడం లేదంటూ ఫిర్యాదులు చేస్తున్నారు.కొంత మంది యూజర్స్ అయితే మీమ్స్ తో గూగుల్ ని ఓ ఆటాడేసుకుంటున్నారు.

ఆ మీమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ని పునరుద్ధరించడానికి ట్రై చేస్తున్నారంటూ.

ఓ బొమ్మ గుండెను నొక్కుతున్న వీడియోను పోస్ట్ చేశారు.గూగుల్ కి గుండెపోటు వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో #Googledown అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.l

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube