140 దేశాలను ఓడించి భారత్‌ను గెలిపించిన టీచర్‌కు కరోనా

ఉపాధ్యాయుడంటే విద్యార్ధులను ఉత్తమ పౌరులగా తీర్చిదిద్దడమే కాకుండా సంఘసంస్కర్త అని నిరూపించి గ్లోబల్ టీచర్ అవార్డును పొందిన రంజిత్ సిన్హ్ దిసెల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.గత వారం ఈ ప్రతిష్టాత్మక అవార్డు పొందిన ఆయన అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే, గవర్నర్ భగత్‌ సింగ్ కోశ్యారీలతో పాటు పలువురు ప్రముఖులను కలిశారు.

 Global Teacher Award Winner Ranjisinh Disale Corona Positive, Global Teacher Awa-TeluguStop.com

దంతో వారంతా భయాందోళనలకు గురవుతున్నారు.ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్న రంజిత్‌, ఆయన భార్య‌కు పాజిటివ్‌ తేలింది.

దీంతో దంపతులిద్దరూ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.
ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పడంతో పాటు సంఘసంస్కర్తగా దురాచారాలను రూపుమాపినందుకు రంజిత్ సిన్హ్ దిసాలేను ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్-2020’ను వరించింది.దీని కింద ఆయన 1 మిలియన్ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో 7.38 కోట్ల రూపాయలు) నగదు బహుమతి అందుకోనున్నారు.వృత్తిలో అత్యుత్తమంగా నిలిచిన వారికి వర్కే ఫౌండేషన్ ఏటా ఈ అవార్డును అందజేస్తుంది.లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో గురువారం ఈ ఎంపిక కార్యక్రమం జరిగింది.ఈ పోటీలో 140 దేశాల నుంచి మొత్తం 12 వేలకు పైగా నామినేషన్లు దాఖలవ్వగా.తుది వడపోతలో మొత్తం పది మంది నిలిచారు.

ఈ లిస్ట్‌లో రంజిత్ గెలుపొందినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు ప్రకటించారు.

Telugu Covid, Teacheraward, Quarantine-Telugu NRI

తన గ్రామంలో ఓ పక్క గోడౌన్, మరో పక్క గోశాల మధ్య శిథిలావస్థలో వున్న బడి భవనాన్ని బాగు చేయించారు.పాఠాలను మరాఠాలోకి అనువదించి.వాటికి టెక్నాలజీ మేళవించి క్యూఆర్ కోడ్ ద్వారా విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

అందరూ టీచర్లలా కాకుండా ఆడియో, వీడియో, కథల రూపంలో పాఠాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.గ్రామంలో బాల్య వివాహాలను రూపుమాపడానికి రంజిత్ కీలక పాత్ర పోషించారు.

బాలురతో సమానంగా బాలికలు సైతం పాఠశాలకు హాజరయ్యేలా చూశారు.షోలాపూర్ జిల్లా పరిదేవాడికి చెందిన జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రంజిత్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

మరోవైపు కోవిడ్ హీరో అవార్డు పేరిట ఇచ్చిన ప్రత్యేక పురస్కారానికి యూకేకు చెందిన గణిత ఉపాధ్యాయుడు జేమీ ఫ్రాస్ట్‌కు అందజేశారు.లాక్‌డౌన్ సమయంలో ఆయన డాక్టర్ ఫ్రాస్ట్ మ్యాథ్స్ ’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి ఈ సంక్షోభ కాలంలో పాఠశాలకు దూరంగా వున్న విద్యార్ధులకు పాఠాలను చేరువ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube